Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీలో నాకు అన్యాయం జరిగింది కనుకే వైసీపీలో చేరానన్న దేవినేని అవినాష్

Recommended Video

    Devineni Avinash Appointed As YSRCP Vijayawada East Incharge || జగన్ కి రుణపడి ఉంటాను..!!

    తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన యువ నేత దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీలో తనకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి, ఆయన పై నమ్మకంతో, తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు చెప్పిన దేవినేని అవినాష్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పూర్తి స్థాయిలో పని చేస్తానని పేర్కొన్నారు.

    అధికారం ఎక్కడ ఉంటే దేవినేని అవినాష్ అక్కడ ఉంటాడు అన్న టిడిపి నేతల వ్యాఖ్యలపై దేవినేని అవినాష్ స్పందించాడు. అధికారం కోసం వెంపర్లాడే స్వభావం తనది కాదని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడైనా కార్యకర్తలు అభిమానాన్ని సంపాదించాను తప్ప ఏనాడూ డబ్బు సంపాదించి లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని గత ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు నుండి టికెట్ కావాలని కోరినా గుడివాడ టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని తో తనకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

    Devineni countered tdp .. Devineni Avinash joined YCP because of injustice in TDP

    టిడిపిలో ఉన్నంతకాలం టిడిపికి ఉపయోగపడ్డానని చెప్పిన దేవినేని అవినాష్ టిడిపిలో ఉన్న సమయంలో తాను ఎలాంటి తప్పులు చేయలేదని, భూకబ్జాలు చేయలేదని, నేరారోపణలేవి తనపై లేవని పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న అందరు నాయకులను కలుపుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తానని చెప్పిన దేవినేని అవినాష్ తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+