వెన్నుచూపిన నువ్వా: జగన్‌కు ఉమ, ఏం లేవో చెప్పాలని పవన్ కళ్యాణ్‌కు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హోదాను అడ్డు పెట్టుకొని చంద్రబాబును నిందిస్తున్నారన్నారు.

అసెంబ్లీలో వెన్నుచూపి పారిపోయిన వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంటే రాళ్లు వేస్తున్నారన్నారు. కుళ్లు, కుతంత్రాలతోనే జగన్ మాట్లాడుతున్నారన్నారు.

వాళ్లెవరో తెలియదు, మీ పిల్లల్ని పంపించకండి: విశాఖ కలెక్టర్, సీపీ

ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ఇస్తున్న ప్రత్యాక ప్యాకేజీలో ఏం లేవో చెప్పాలని సూటిగా వైయస్ జగన్‌ను, పరోక్షంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు.

Devineni lashes out at YS Jagan for his comments on Chandrababu

కాగా, అంతకుముందు వైయస్ జగన్ ప్రత్యేక హోదా పైన మాట్లాడిన విషయం తెలిసిందే. తాను ఆర్కే బీచ్‌కు వస్తానని చెప్పారు. హోదా విషయంలో ఇటు బీజేపీని, అటు టిడిపిని వేలెత్తి చూపించారు.

హోదా కోసం తాము ధర్నాలు చేశామని, నిరాహార దీక్షలు చేశామని, ఆఖరుకు ఢిల్లీలో కూడా ధర్నాలు చేశామని జగన్ చెప్పారు. హోదా సాధించుకునేందుకు చంద్రబాబు మనకు తోడుగా నిలవాలన్నారు. కానీ ఆయన అండగా నిలబడటం లేదన్నారు. చంద్రబాబు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+