కొడాలి నాని - వంశీని ఓడిస్తాం : తొడ గొట్టిన ఉమా -రావి : నీకు దమ్ముంటే..!!
కృష్ణా జిల్లా టీడీపీ నేతలు తొడ కొట్టారు. జిల్లాలో టీడీపీకి సవాల్ గా మారిన మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీలను వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతామంటూ శపధం చేసారు. మాజీ మంత్రి దేవినేని ఉమా - గుడివాడ టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు తొడగొట్టి..వారిని ఓడిస్తామంటూ సవాల్ చేసారు. వారి ఓటమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పనిచేయాలి మాటకు మాట.. దెబ్బకుదెబ్బ ఇచ్చి తీరుతామంటూ ప్రసంగించారు.

కొడాలి పై ఉమా సంచలన వ్యాఖ్యలు
నాయకులు మొదలు కార్యకర్తల వరకు తొడ కొట్టడాలు, ఈలలు, కేరింతలతో హోరెత్తించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నేతలు వైసీపీ నేతలే లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ‘ఓరేయ్ బూతులోడా నీ ఒళ్లు దగ్గరపెట్టుకో, నీవెక్కడ ఉన్నా సరే బయటకు లాక్కొచ్చి కొడతాం' అంటూ హెచ్చరించారు. ‘నీకు దమ్ముంటే 2024లో టీడీపీ గెలుపును అడ్డుకోవాలి' అంటూ తొడగొట్టి సవాల్ విసిరారు. కొడాలినాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్‌ను చట్టసభల్లోకి అడుగు పెట్టనీయ బోమని ప్రతి టీడీపీ కార్యకర్త ప్రతినబూనాలని పిలుపుని చ్చారు.

నాని..వంశీ..అవినాశ్ ఓటమే లక్ష్యంగా
ఎప్పుడైతే వైసీపీ పంచన చేరాడో అప్పుడే అవినాశ్ రాజకీయ జీవితం ముగిసిందన్నారు. తన నియోజకవర్గంలో వెటకారపు మంత్రిగా పేరుపొందిన ఓ పెద్దాయన పదవి ఊడటంతో మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముఖ్యమైన టీడీపీ నాయకులు విజయవాడ తూర్పు, గుడివాడ, గన్నవరంలో గ్రామాలను దత్తత తీసుకుని, ప్రత్యర్థుల ఓటమికి వ్యూహాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నేతలు సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపైన పార్టీ నాయకులు పట్టాభి, దేవినేని గాంధీపై దాడి చేయించడం ద్వారా అవినాశ్ తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.

తొడగొట్టి సవాళ్లు చేస్తూ.
గుడివాడ టీడీపీ ఇంఛార్జ్ రావి వేంకటేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నాయకులు, శ్రేణులు ఐక్యంగా ఉండి కొడాలి నానీని ఓడిస్తామని తొడగొట్టి శపథం చేశారు. వైసీపీ నాయకులు ప్రజలను విస్మరించి సంస్కారహీనంగా మాట్లాడుతూ దోపిడీయే లక్ష్యంగా సాగుతున్నారని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. త్వరలో మైలవరం, గుడివాడల్లో చంద్రబాబు అధ్యక్షతన మినీ మహానాడును నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications