జగన్‌కు కౌంటర్: సీమలో దేవినేని ఉమ యాత్ర
విజయవాడ: పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకుంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి రాయలసీమ ద్రోహులని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. జగన్‌ది ప్రాజెక్టుల యాత్ర కాదని, పశ్చాత్తాప యాత్ర అని ఎద్దేవా చేశారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్, రఘువీరాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి జగనే కారణమని ఆరోపించారు. రాయలసీమ ప్రజలు త్వరలోనే జగన్, రఘువీరాలను ఛీకొడతారని ఆయన వ్యాఖ్యానించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు సర్వే చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి దేవినేని తెలిపారు.

జగన్ బస్సు యాత్రకు కౌంటర్‌గా పట్టిసీమ ఆవశ్యకతను వివరిస్తూ రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నట్లు మంత్రి దేవినేని ఉమ చెప్పారు. ఈ నెల 16న అనంతపురంలోని హంద్రీనీవా, 17 న కడప, చిత్తూరు జిల్లాల్లోని గండికోట, నగరి, 18 న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కండలేరు, సోమశిల, గుండ్లకమ్మ ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు మంత్రి చెప్పారు.
రైతుల రుణమాఫీ, పట్టిసీమ ప్రాజెక్టులను వ్యతిరేకించిన జగన్‌ను ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని దేవినేని ఉమా చెప్పారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications