Tirumala: లడ్డూ కల్తీ నెయ్యి కేసులో పోలీసు బాస్ పక్కా క్లారిటీ, సజ్జల

కలియుగదైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం విచారణ చెయ్యడానికి ప్రత్యేక టీమ్ సిద్దం అవుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారాక తిరుమలరావు స్పష్టం చేశారు. కేంద్రం చేపట్టే స్వతంత్ర విచారణలో మా జోక్యం ఉండదని ఏపీ పోలీసు బాస్ ద్వారాకా తిరుమల రావు అన్నారు.

మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కేంద్ర ప్రభుత్వం చేపట్టే దర్యాప్తు సంస్థ తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి డీఐజీ గోపీనాథ్ జెట్టి, సర్వశ్రేష్ట త్రిపాఠీ పేర్లు పంపించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాకు చెప్పారు.

DGP said that we will not interfere in Tirumala laddu adulterated ghee case

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ ను సుప్రీం కోర్టు అనుమానించలేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామక్రిష్ణా రెడ్డిపై లుక్ ఔట్ నోటీసు ఉందని, ఆయన కోసం పోలీసులు గాలించారని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. వైసీపీ నాయకుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.

DGP said that we will not interfere in Tirumala laddu adulterated ghee case

ఒక కేసులో సజ్జల మీద గుంటూరు జిల్లా ఎస్పీ లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారని, ఆ కేసు విషయంలో విచారణ జరుగుతుందని డీజీపీ ద్వారాక తిరుమలరావు అన్నారు. చట్టపరంగా మాపని మేము చేసుకుని వెలుతామని, ఎవ్వరి మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసు, గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసుతో పాటు మరో రెండు కేసులను సీఐడీకి బదిలీ చేశామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+