Diabetes danger bells: మధుమేహం భారీ విస్పోటనం; దేశానికి ముంచుకొస్తున్న ఉపద్రవం!!
దేశానికి పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దేశం ఆరోగ్య సంక్షోభంలో పడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలో రోజురోజుకీ మధుమేహ బాధితులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం దేశంలో 101 మిలియన్ల మంది డయాబెటిస్ బాధితులు ఉన్నారని ఐసీఎంఆర్ తాజా అధ్యయనం వెల్లడించింది.
2019లో ఐసీఎంఆర్ అధ్యయనంలో డయాబెటిస్ బాధితులు 70 మిలియన్లు ఉండగా, ఈ సంఖ్య నాలుగు సంవత్సరాలలో 100 మిలియన్ లను దాటడం అత్యంత ఆందోళనకరమైన విషయం . ఇక ఈ అధ్యయన ఫలితాలను లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రకటించారు. తాజాగా 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అధ్యయనం చేపట్టిన ఐసిఎంఆర్ జనాభాలో కనీసం 15.3 శాతం మందిలో అంటే 136 మిలియన్ల మందికి ఫ్రీ డయాబెటిస్ ఉందని పేర్కొంది.

గోవాలో 26.4 శాతం, పుదుచ్చేరిలో 26.3 శాతం, కేరళలో 25.5 శాతం మధుమేహం జాతీయ సగటు అయినా 11.4 శాతానికి రెట్టింపు లో ఉందని అధ్యయనంలో వెల్లడించింది. దేశంలో అత్యల్పంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డయాబెటిక్ బారినపడిన వారు 4.8 శాతం ఉన్నారు ప్రీ డయాబెటిక్ లో మాత్రం జాతీయ సగటు 15.3 శాతం కంటే అధికంగా 18 శాతం ఉన్నట్టు అధ్యయనం గుర్తించింది.
యూపీలో ఒక వ్యక్తి డయాబెటిస్ తో బాధపడుతుంటే నలుగురు వ్యక్తులు ప్రీ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ప్రీ డయాబెటిక్ బాధితులు అందరూ కూడా త్వరలోనే డయాబెటిస్ బాధితులుగా మారతారు. కాబట్టి అక్కడ మధుమేహ రోగుల సంఖ్య త్వరలోనే పెరగనుంది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తికి మధుమేహం ఉంటే ప్రీ డయాబెటిస్ ముగ్గురికి ఉంది.
రాబోయే కొన్ని సంవత్సరాలలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి డయాబెటిస్ తక్కువ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలలో, ప్రీ డయాబెటిస్ కేసుల కారణంగా మధుమేహం కేసులు విపరీతంగా పెరుగుతాయని అధ్యయనం హెచ్చరిస్తోంది. గోవా, కేరళ, చండీఘడ్, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న మధుమేహం కేసులతో పోలిస్తే, ప్రీ డయాబెటిస్ కేసులు తక్కువగా ఉన్నాయి. ఇక మధుమేహం, ప్రీ డయాబెటిస్ కేసులు పుదుచ్చేరి, ఢిల్లీలలో సమానంగా ఉన్నాయి.
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవటం, ఒత్తిడి విపరీతంగా పెరగటం వంటి అనేక కారణాలు డయాబెటిస్ బాధితులుగా మారుస్తున్నాయి. ఇంత తీవ్రంగా డయాబెటిస్ పెరుగుతున్న నేపధ్యంలో అయినా బీ అలెర్ట్. డయాబెటిస్ విషయంలో నిర్లక్ష్యం ఆరోగ్యానికి హాని చేస్తుంది. దేశాన్ని మధుమేహ గ్రస్త దేశంగా చేస్తుంది.












Click it and Unblock the Notifications