వివాదంలో సాయిరెడ్డి కొత్త పార్టీ?- ఇప్పటికే అదే పోరుతో మరో పార్టీ-ఎన్నికల్లో పోటీ..!
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. దానికి పరివర్తన రాజనీతి పార్టీ అని పేరు కూడా పెట్టుకున్నారు. విజయవాడలో అట్టహాసంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పార్టీ పేరు, అజెండా, జెండాను కూడా విడుదల చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు. పనిలో పనిగా చంద్రబాబు, జగన్ పై తన విమర్శల దాడి కొనసాగించారు. ఇదంతా బాగానే ఉన్నా .. ఇప్పటికే పనిచేస్తున్న ఓ రాజకీయ పార్టీ పేరును పోలిన పేరునే సాయిరెడ్డి తన పార్టీకి పెట్టుకోవడం వివాదాస్పదమవుతోంది.
విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీకి పరివర్తన రాజనీతి పార్టీ (PRP)అని పేరు పెట్టుకున్నారు. అయితే దక్షిణాదిలోని తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఇప్పటికే పరివర్తన్ రాజ్ నీతి పార్టీ (PRP) పేరుతో మరో పార్టీ పనిచేస్తోంది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో పరిమిత స్ధానాల్లో పోటీ చేసిన ఈ రాజకీయ పార్టీ ఎక్కడా గెలవలేకపోయింది. అయితే ఉనికిలో మాత్రం ఉంది. దీని పేరును పోలిన విధంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి తన పార్టీకి పేరు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.

ఆల్ రెడీ VSR పెట్టిన పార్టీ ఎవడో పెట్టాడు ముందే 😂 https://t.co/Eyds8eywn4
— Praveen Reddy (@PRAVEENREDDYYCP) November 11, 2026
ఇప్పటికే పరివర్తన రాజనీతి పార్టీ అంటే పీఆర్పీగా పిలుస్తున్న విజయసాయిరెడ్డి పేరు గతంలో చిరంజీవి స్థాపించి, మూడేళ్ల పాటు నడిపించి, ఆ తర్వాత కాంగ్రెస్ లో కలిపేసిన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) తరహాలోనే ఉందన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు మరో రాజకీయ పార్టీని పోలిన పరివర్తన రాజనీతి పార్టీ పేరును విజయసాయిరెడ్డి కావాలనే ఎంచుకున్నారా లేక తెలియక ఎంచుకున్నారో తెలియదు. అయితే ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి వివాదం లేకపోయినా, రేపు సాయిరెడ్డి పార్టీ క్లిక్ అయ్యాక ఆ తమిళనాడు, పుదుచ్చేరి పార్టీ వచ్చి వివాదం చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఏదేమైనా రాజకీయాాల్లో సీనియర్ అయిన విజయసాయిరెడ్డికి కొత్త పార్టీ పెట్టుకునేందుకే పేరే దొరకలేదా అన్న చర్చ మాత్రం జరుగుతోంది.














Click it and Unblock the Notifications
