కెసిఆర్‌తో మాట్లాడారా: టీ నేతలతో డిగ్గీ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు విషయంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్వియ్‌ సింగ్ చర్చలు జరిపారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో మీరెవరైనా మాట్లాడారా ఆయన తెలంగాణ నేతలను ప్రశ్నించారు. మీ ఆదేశాలు లేనిది ఎలా మాట్లాడగలమని తెలంగాణ నేతలు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పొత్తులపై కొంత సమయం వేచి చూద్దామని తెలంగాణ కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ అన్నట్లు సమాచారం.

కాగా, తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం గాంధీభవన్ గురువారం సాయంత్రం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శాసనసభ, లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ నగరానికి వచ్చిన రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్‌తో కాంగ్రెస్ నేతలు గురువారం ఉదయం పార్క్ హయత్ హోటల్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల, ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ రఘువీరా, తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ సమావేశమైన వారిలో ఉన్నారు.

అంతకు ముందు దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ, రేపు ఎన్నికల కమిటీతో సమావేశం కానున్నామని, మూడు రోజుల పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుపనున్నట్లు తెలిపారు. తుది జాబితాను సిద్ధం చేసి స్టీరింగ్ కమిటీ ముందు ఉంచనున్నట్లు చెప్పారు. ఈనెల 24, 25 తేదీల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని దిగ్విజయ్ వెల్లడించారు.

నగరానికి చేరుకున్న దిగ్విజయ్ సింగ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో దిగ్విజయ్‌కు ఇరు ప్రాంతాల పిసిసి అధ్యక్షులు పొన్నాల, రఘువీరా, తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్, మాజీ మంత్రి దానం నాగేందర్ స్వాగతం పలికారు.

దిగ్విజయ్‌తో తెలంగాణ నేతలు

దిగ్విజయ్‌తో తెలంగాణ నేతలు

గురువారంనాడు దిగ్విజయ్ సింగ్‌తో తెలంగాణ కాంగ్రెసు నాయకులు సమావేశమయ్యారు. ఎన్నికల కసరత్తుపై ఈ సమావేశంలో చర్చించారు.

దిగ్విజయ్ సింగ్‌తో పొన్నాల...

దిగ్విజయ్ సింగ్‌తో పొన్నాల...

పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో దిగ్విజయ్ సింగ్‌తో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు

దిగ్విజయ్ రాక సందర్భంగా..

దిగ్విజయ్ రాక సందర్భంగా..

దిగ్విజయ్ సింగ్ రాక సందర్భంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇలా చురుగ్గా కనిపించారు.

జైపాల్ రెడ్డితో భేటీ..

జైపాల్ రెడ్డితో భేటీ..

హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆయనతో మాటామంతీ జరిపారు.

దిగ్విజయ్ వద్దకు క్యూ..

దిగ్విజయ్ వద్దకు క్యూ..

గురువారం హైదరాబాదు వచ్చిన ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ వద్దకు ఇరు ప్రాంతాల నాయకులు క్యూ కట్టారు.

రఘువీరా రెడ్డి ఇలా...

రఘువీరా రెడ్డి ఇలా...

హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్ సింగ్‌ను గురువారంనాడు ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి కూడా కలుసుకున్నారు.

దిగ్విజయ్ సింగ్ ఇలా...

దిగ్విజయ్ సింగ్ ఇలా...

హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ గురువారంనాడు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించి అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+