ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దర్శకుడు కృష్ణ వంశీ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఒక్క ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పైన అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తాజాగా తిరుమల లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ తాజాగా సనాతన ధర్మం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ పై కృష్ణ వంశీ సంచలన వ్యాఖ్యలు
సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలు అయినా ఇస్తానంటూ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పైన ప్రస్తుతం హైందవ సమాజం నుండి ప్రశంసల జల్లు కురుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పైన విమర్శలు చేస్తున్న వారు కూడా లేకపోలేదు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

కృష్ణ వంశీకి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి నెటిజన్ ప్రశ్న
పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ హీరో అంటూ ఆయన కొనియాడారు. సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్ లతో తరచూ ఇంటరాక్ట్ అవుతూ వారు అడిగే ప్రశ్నలకు స్పందించే ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తాజా పరిస్థితుల పైన చర్చనీయాంశమైన తిరుమల లడ్డు వివాదం పైన అనుభవం ఉన్న దర్శకుడుగా మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామని ఎక్స్ వేదికగా ఒక నెటిజన్ ప్రశ్న అడిగారు.
ఆయనంటే ప్రేమ, గౌరవం
అందుకు సమాధానం ఇచ్చిన కృష్ణవంశీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. అవినీతిమయంగా మారిన రాజకీయాలలో ఓ వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడని, భగవంతుడు ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కృష్ణవంశీ వ్యాఖ్యలు చేశారు.

యోగి ఆదిత్యనాథ్ తర్వాత అంతటి విలువలున్న వ్యక్తి పవన్ కళ్యాణ్
నిజం ఎప్పటికైనా నిజమేనని దానిని నిరూపించడానికి ఎవరి అంగీకారం అవసరం లేదని యోగి ఆదిత్యనాథ్ తర్వాత అంతటి విలువలు, తెలివితేటలు ఉన్న ప్రత్యేక రాజకీయవేత్త పవన్ అంటూ కొనియాడారు. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ హీరో అని, తాజా పరిస్థితులలో మరోమారు రుజువైందని కృష్ణవంశీ పేర్కొన్నారు. ఆయన లాంటి రాజకీయ నాయకులు ఎందరో రావాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కృష్ణ వంశీ వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ ఫిదా
పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కృష్ణవంశీ చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం జనసేన నేతలు పవన్ కళ్యాణ్ అభిమానులు కృష్ణవంశీని తెగ పొగుడుతున్నారు. కృష్ణవంశీ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమంటూ కొనియాడుతున్నారు. పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని, అదే విషయాన్ని కృష్ణవంశీ చెప్పినట్టుగా వారంతా అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications