చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే వార్త.. వారికి నో ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. టిడిపి కూటమి పగ్గాలు చేపట్టే క్రమంలో సీఎంగా చంద్రబాబు తో పాటు 10 మంది వరకు మంత్రులు ప్రమాణస్వీకారం కోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి సిద్ధమవుతోంది. ముఖ్యఅతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు.

11 ఎకరాల స్థలంలో లక్ష మంది పాల్గొనేలా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
అదే విధంగా వివిధ జాతీయ పార్టీల నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. మొత్తం 11 ఎకరాల స్థలంలో లక్ష మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి టిడిపి అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Disappointing news for Chandrababu fans at the time of chandrababu swearing-in No entry for them

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సభా ఏర్పాట్లు
ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. 80 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టేజి సిద్ధం చేశారు. జర్మన్ హాంగర్స్ తో భారీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. అతిధులు విఐపి ల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారికే అనుమతి
అంతేకాదు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబ సభ్యుల కోసం మరొక గ్యాలరీని ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్
స్థలాభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార ఘట్టాన్ని ఘనంగా నిర్వహించడం కోసం అధికారులు భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు టిడిపి ముఖ్య నాయకులు కూడా సభా వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లాలని పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు భావిస్తున్న తరుణంలో పాసులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పడం కొంత అభిమానులను నిరాశకు గురిచేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+