ద్రోణి ప్రభావం, మళ్లీ భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో భిన్నంగా ఉన్నాయి. వరుసగా భారీ వర్షాలు.. తుఫాను ఎదుర్కొన్న తరువాత వేడి..ఉక్కపోత మొదలైంది. కాగా, ఇప్పుడు మరోసారి వర్షాల పైన విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక చేసింది. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారుతున్నాయి. ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంత పురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదు గా ఈ ద్రోణి కొనసాగుతోందని వివరించారు. నిన్న ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అటు
తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. క్యుములో నింబస్‌ మేఘాలు అలముకోగా వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

disaster-management-alerts-over-rains-in-ap-and-telangana-for-next-two-days

ఇక, హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావం కారణంగా.. నిన్న ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంత పురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా బి.చెర్లపల్లిలో 65.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా. శ్రీసత్యసాయి జిల్లా గండ్లపెంటలో 45 మి.మీ., నెల్లూరు జిల్లా రాపూర్‌లో 40.5 మి.మీ., విజయవాడ తూర్పులో 39 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు విపత్తుల శాఖ వెల్లడించింది. వర్షాల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కిందకు వెళ్లవద్దని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+