హైదరాబాద్, విశాఖపట్నం ప్రజల నెత్తిన పాలుపోసిన నరేంద్రమోడీ

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రస్తుతం రైళ్లకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. ఈ మార్గం కూడా ఎప్పుడూ రద్దీగా ఉంటోంది. రద్దీని నియంత్రించలేక కొన్ని రైళ్లను అధికారులు నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా నడిపిస్తున్నారు. టికెట్లు దొరకడం గగనం అవుతోంది. విశాఖపట్నం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హైస్పీడ్ ట్రాక్ కోసం సర్వే జరుగుతోంది. తాజాగా భద్రాచలం రోడ్డు నుంచి ఏపీలోని కొవ్వూరుకు నిర్మించే రైల్వేలైనుకు కేంద్రం పచ్చజెండా ఊపించింది. దీనివల్ల విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య 125 కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. విజయవాడ స్టేషన్ కు వచ్చే అవసరం లేకుండా కొన్ని రైళ్లు నేరుగా ఈ మార్గంలో ప్రయాణించి కాజీపేట మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయి.

ఇప్పటికే 57 కిలోమీటర్ల లైను అందుబాటులో ఉంది
ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2155 కోట్లు కాగా 119 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైను నిర్మిస్తారు. ఇందులో 50 శాతం ఖర్చును చంద్రబాబు ప్రభుత్వం భరిస్తోంది. వాస్తవానికి ఈ లైను నిర్మాణంపై 1970 నుంచి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. సర్వేల పేరుతో కోట్లరూపాయలు మాత్రం ఖర్చుపెట్టారు. ఈ రైల్వే లైను నిర్మాణం వల్ల బొగ్గు రవాణా సులభం అవుతుంది. కొత్తగూడెం-సత్తుపల్లి మధ్య ఇప్పటికే 57 కిలోమీటర్ల రైల్వే లైను అందుబాటులో ఉంది. 2022లో రూ.990 కోట్లతో ఈ ట్రాక్ నిర్మాణం పూర్తయింది. విశాఖ, కాకినాడ పోర్టు నుంచి నాగ్ పూర్, భోపాల్ వైపు సరకు రవాణా చేయడానికి ఈ మార్గం చాలా వీలు కల్పిస్తుంది.

distance between Visakhapatnam and Secunderabad is being reduced by 125 km with the Bhadralacham-Kovvur railway line

200 గ్రామాలకు సౌకర్యం కలుగుతుంది
ఏపీ, తెలంగాణలోని గిరిజన ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు రైళ్లు అందుబాటులోకి వస్తాయి. దాదాపు 200 గ్రామాలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ప్రాజెక్టు నిర్మాణం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దాదాపు ఐదు సంవత్సరాల సమయంలో దీన్ని పూర్తిచేస్తారు. మూడు సంవత్సరాల్లోగా పూర్తిచేయాలని చంద్రబాబు ప్రభుత్వం కోరుతోంది. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ ప్రాజెక్టు మంజూరు చేసినందుకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+