వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచివాలయ ఉద్యోగుల విభజన, టికి 805, ఎపికి 1060

By Srinivas
|
Google Oneindia TeluguNews

Division of Secretariate employees
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల విభజన జరిగింది. సచివాలయంలోని 1865 మంది ఉద్యోగులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విభజించారు. ఉద్యోగులను స్థానికత ఆధారంగా విభజించారు. ఇందులో తెలంగాణకు 805, ఆంధ్రప్రదేశ్‌కు 1060 మంది ఉద్యోగులను ఇచ్చారు.

సచివాలయ ఉద్యోగుల విభజనకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్లో పెట్టారు. సచివాలయ ఉద్యోగుల విభజన పైన ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే బుధవారం మధ్యాహ్నం 12 గంటల లోగా తెలియజేయాలని పేర్కొన్నారు.

అయితే ఉద్యోగుల విభజన పైన తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల విభజన సక్రమంగా జరగలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎక్కడా పారదర్శకత లేదన్నారు. స్థానికత ఆధారంగా అంటే... ఉద్యోగుల తండ్రి ఎక్కడి వారో కూడా చూసుకోవాలని వారు చెబుతున్నారు. ఉద్యోగుల విభజన లిస్ట్ పూర్తిగా తప్పుల తడక అని టిఎన్జీవే నేత నరేంద్ర రావు అన్నారు. నిజమైన తెలంగాణ ఉద్యోగులు ఎవరో తామే ప్రకటిస్తామని చెప్పారు. ఒక్క సీమాంద్ర ఉద్యోగిని కూడా తెలంగాణలో పని చేయనివ్వమన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో జూన్ 2న అపాయింటెడ్ తేదీ ఉన్న విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఏర్పడనున్నాయి. ఈలోగా విభజనకు సంబంధించిన అన్ని అంశాలను పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

English summary
Division of Andhra Pradesh Secretariate employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X