కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసులోనే ఉంటా, కిరణ్‌కు విరాళం ఇస్తా: డిఎల్

By Pratap
|
Google Oneindia TeluguNews

 DL Ravinder Reddy
కడప: తాను కాంగ్రెసు పార్టీని వీడే ప్రసక్తి లేదని మాజీ మంత్రి, కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో మంచి పదవులు అనుభవించానని, గొప్ప నాయకుడిగా ఎదిగానని, అందువ్లల కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కడప జిల్లా చాపాడులో రచ్చబండ కార్యక్రమం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు డిపాజిట్ రాకపోయినా పోటీ చేస్తానని చెప్పారు. బంగారు తల్లి పథకానికి సంబంధించి 36 మందికి మంజూరు పత్రాలు ఇవ్వగా వీరిలో ముగ్గురికి మాత్రమే ఒక్కొక్కరికి రూ.2500 వారి అకౌంట్లలో జమ చేశారన్నారు.

పాలకులకు తెలివి లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏ పాలకులని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఒకరి గురించి కాదు అందరూ అంతే అన్నారు. కొంత మంది అధికారులు డబ్బుల కోసం పాలకులకు తప్పుడు, సలహాలు ఇస్తున్నారన్నారు. బంగారు తల్లి పథకం మంచిదే కాని డబ్బు లబ్దిదారులకు పడిందో లేదో తెలుసుకోవాలన్నారు.

నేటి సమాజంలో రాజకీయ నాయకులతో వ్యవస్థ దిగజారిపోతోందని ఆయన రచ్చబండ కార్యక్రమంలో అన్నారు. మాజీ కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను మంచి పరిపాలన కోసం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రచ్చబండ కార్యక్రమం గ్రామాల్లో నిర్వహించి వుంటే బాగుండేదన్నారు. ప్రజలు వారి సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేవారన్నారు.

ప్రభుత్వం ప్రజలకు ఆశ కల్పించి సమస్యలను పరిష్కరించకుండా ముఖాన ఉమ్మి వేసే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మసకబారి పోతోందన్నారు. గ్రామాల్లో ప్రజలు కక్షలు మాని జీవించాలన్నారు.

English summary
Congress MLA and former minister DL Ravindra Ressy clarified that he will not quit party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X