ప‌రిపాల‌న రాజ‌ధాని విశాఖ‌లో ఏఏ శాఖ‌లు ఎక్క‌డో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్నం అని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే కీలక ప్రకటన చేసింది. ఆ త‌ర్వాత‌ కోర్టు చిక్కులు, కరోనా కారణంగా బ్రేక్‌లు ప‌డుతూనే ఉన్నాయి. అయితే, కొన్ని నెలలుగా దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలిస్తామని ప్రకటిస్తున్న సీఎం జగన్ తాజాగా కేబినెట్లోనూ ప్రకటన చేసేశారు.

ఆ దిశగా విశాఖకు రాజధానిని తరలించేందుకు విజయదశమిని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అంతే కాకుండా రుషికొండ వద్ద నిర్మిస్తున్న భవనాల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ముందుగా కీలక హెచ్వోడీ కార్యాలయాలను విశాఖకు తరలించనున్నారు. ఆ విష‌యాలేంటో తెలుసుకుందాం.

YV Subba Reddy Sajjala

విశాఖ త‌ర‌లింపుపై నేత‌ల వ్యాఖ్య‌లు: విశాఖకు రాజధాని తరలింపుపై ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా వికేంద్రీకరణపై తాము స్పష్టతతో ఉన్నామని, విశాఖ వేదికగా పాలన అనేది రాజకీయ నిర్ణయం కాదని, వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలనేేదే తమ ఉద్దేశమన్నారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రాజధాని తరలింపుపై సంకేతాలు ఇచ్చారు.

 Do you know where the new departments in the administrative capital Visakhapatnam?

ఏఏ శాఖ‌లు ఎక్క‌డా: ముహుర్తం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది ఏఏ శాఖ‌లు ఎక్క‌డెక్కాడా అనే ప‌నిలో అధికారులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ద‌స‌రా ముహుర్తంగా ఖ‌రారు చేసి సిఎంమో స‌హా ఇత‌ర శాఖ‌ల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు భ‌వ‌నాల ఎంపిక బాధ్య‌త‌ను వ‌స‌తుల క‌మిటీకి అప్ప‌గించ‌నుంది. విశాఖ‌లోని ఋషికొండ‌పై నిర్మిస్తున్న ఆరుభ‌వనాల‌పై ఇప్ప‌డు అంద‌రి క‌న్నుపడింది. మిగిలిన ఆఫీసులు, మంత్రులు ఎక్క‌డైతే ప‌రిపాల‌న సౌల‌భ్యంగా ఉంటుందో ఆ భ‌వ‌నాల ఎంపిక‌కు ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. మంత్రుల ఆఫీసులు ఆయాశాఖాల్లోని ఖాళీ భ‌వ‌నాల‌ను, అతిథి గృహాల‌ను ఎంపిక చేస్త‌న్న‌ట్లు స‌మాచారం.

RTC Complex

128 ప్లాట్‌లు అద్దెకు: ఆర్‌టిసి కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న ఫ్లోర్ల‌తో పాటు గెస్ట్‌హోస్‌ను ర‌వాణా శాఖ‌మంత్రి కేటాయించే ఛాన్స్‌ ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. జిల్లా ప‌రిష‌త్ గెస్ట్‌హోస్, పంచాయ‌తీ శాఖ మంత్ర‌త్వ శాఖ‌కు కేటాయిస్తున్న‌ట్ల‌, బీచ్‌రోడ్డులో స్మార్‌సిటి భ‌వ‌నం పుర‌పాల‌క శాఖ‌కు, ఈఎన్‌సి ఆఫీస్ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రికి, దేవదాయ శాఖ మంత్రికి సింహ‌చ‌లంలో ఆఫీస్ కేటాయించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బీచ్‌రోడ్ నుండి రిషికొండ వ‌ర‌కు ఉన్నఅపార్టెమెంట్ల‌లో 128 ప్లాట్‌లు అద్దెకు తీసుకుంటున్న‌ట్లుగా ముందుగా సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఆంధ్ర మెండిక‌ల్ కాలేజీ క్వాటర్స్ స‌మీపంలో నిర్మాణంలో ఉన్న డూప్లెక్స్ విల్లాను తీసుకునే ఆలోచ‌న‌ల్లో యంత్రాగం ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆర్థిక శాఖ‌కు క‌లెక్ట‌రేట్ వెనుక కొత్త‌గా నిర్మించిన ఐదంత‌స్తుల భ‌వ‌నాన్ని పరిశీలించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొంద‌రు మంత్రులు విశాఖ‌లో ఇళ్లు కొనుగోలు చేయ‌గా, మ‌రికొంద‌రు అద్దె ఇళ్ల‌ను వెతుక్కునే ప‌నిలో ఉన్నట్లు మీడియా వ‌ర్గాలు చెప్ప‌కుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+