సర్జరీ తరువాత కొడాలి నాని, మరోసారి - డాక్టర్ల బిగ్ అప్డేట్..!!
మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం పై వైద్యులు కీలక అంశాలను వెల్లడించారు. నానికి గుండె శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు 8 గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ తరువాత కొడాలి నాని క్రమేణా కోలుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడారు. ఇదే సమయంలో వైద్యులు నాని ఆరోగ్యం.. ఆస్పత్రి చికిత్స గురించి కీలక సూచనలు చేసారు.
నాని హెల్త్ అప్డేట్
గుండె ఆపరేషన్ తరువాత కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉంది. గుండె సంబంధిత సమస్యల తో హైదరాబాద్ లో ఏఐజీతో చికిత్స తీసుకున్న నాని.. అక్కడ వచ్చిన సూచనల మేరకు వెంటనే ముంబాయిలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబాయికి తరలించారు. ఈ నెల 2వ తేదీన ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు 8 గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వ హించారు. గుండెలో మూడు రక్త నాళాలు పూడికల కారణంగా బైపాస్ నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలోనే నాని చికిత్స తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుతున్నారు.

ఆస్పత్రిలోనే ఉండాలి
కాగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని ఆరోగ్య పరిస్థితి పైన మాజీ సీఎం జగన్ నిరంత రం ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం నాని వేగంగా కోలుకుం టున్నారని.. అవయవాలు బాగా స్పందిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. ఇదే సమయంలో వైద్యులు మరో కీలక సూచన చేసారు. నానికి మరో నెల రోజుల పాటు ఇదే ఆస్పత్రిలో చికిత్స అవసరమని సూచించారు. ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ.. అవసరమైన పరీక్షలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. గుండె సర్జరీ తరువాత శరీరంలో వస్తున్న మార్పులు.. ఇతర ఆరోగ్య సమస్యలను గుర్తిస్తూ అవసరానికి అనుగు ణంగా చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు వివరించినట్లు తెలుస్తోంది.
నెల తరువాతనే
అయితే, నానికి చేసిన సర్జరీ సక్సెస్ కావటం పైన వైసీపీ నేతలు.. నాని అనుచరులు సంతోషం తో ఉన్నారు. నెల రోజుల పాటు నాని ఆస్పత్రిలోనే ఉన్నా.. పూర్తిగా కోలుకొని తిరిగి రాజకీయంగా యాక్టి వ్ కావాలని కోరుకుంటున్నారు. గుడివాడ వైసీపీ నేతలు నాని కుటుంబ సభ్యులతో టచ్ లో ఉం టూ పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. కొడాలి నాని ఆపరేషన్ వేళ ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేసారు. ఇప్పుడు నాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరో నెల రోజుల పాటు ముంబాయి ఆస్పత్రిలోనే కొడాలి నాని ఉండనున్నారు. పూర్తిగా మెరుగైన తరువాత డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications