ఆగని కుక్కల దాడి, ఐదుగురు వ్యక్తులపై దాడి: మంత్ర నారాయణ ఆగ్రహం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో కుక్కల దాడులు ఆగడం లేదు. శనివారం ఉదయం వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురిపై దాడి చేసిన కుక్కలు తాజాగా ఆనందపురంలో ఓ వ్యక్తిపై దాడి చేశాయి. దాదాపు ఐదు కుక్కలు వ్యక్తిపై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కుక్కల దాడిలో విశాఖపట్నం ఓ చిన్నారిపై మరణించిన విషయం తెలిసిందే.
కుక్కల దాడి రెండేళ్ల చిన్నారి మృతి ఘటనపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపాలిటీల్లో కుక్కలను నియంత్రించాలని అధికారలను ఆదేశించారు. వారంలోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మునిసిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు.

బిటెక్ విద్యార్థుల అరెస్టు
ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లాలోని డుంబ్రిగూడ మండలం చాపరాయి సమీపంలో గంజాయి తరలిస్తున్న నలుగురు బీటెక్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భగ్గుమన్న పాత కక్షలు
కడప జిల్లాలోని రాజంపేట మండలం వెంకటరెడ్డిపల్లిలో పట్టపగలే పాతకక్షలు భగ్గుమన్నాయి. గ్రామ ఉపసర్పంచ్ జనార్దన్‌రెడ్డిని వరసకు తమ్ముడైన మధుసూదన్‌రెడ్డి కత్తితో దాడి చేసి హతమార్చారు. స్థానిక దేవాలయం వద్ద వినాయ నిమజ్జనం గురించి చర్చిస్తుండగా ఈ దారుణం జరిగింది.
నిందితుడు మధుసూదన్‌రెడ్డికి అతని మిత్రులు అంకిరెడ్డి, బొట్ల రవీంద్రారెడ్డి సహకరించారని గ్రామస్థులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మధుసూదన్‌రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రొయ్యల వ్యాపారి కిడ్నాప్
నెల్లూరులోని నవాబుపేట మారుతీ నగర్‌లో రొయ్యల వ్యాపారి సుధాకర్‌రెడ్డి కిడ్నాప్‌కు గురయ్యాడు. వ్యాపార భాగస్వాములే కిడ్నాప్ చేశారంటూ టూటౌన్ పోలీస్‌స్టేషన్లో సుధాకర్‌రెడ్డి తల్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications