అమరావతిలో వైసీపీ కీలక నేత రాజీనామా లేఖ..!!
ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ, కూటమి మధ్య ప్రతిష్ఠాత్మక పోరు కొనసాగుతోంది. నామినేషన్ల ఘట్టం పూర్తి కావటంతో ముఖ్య నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీల ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొనేందకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. అమరావతి పరిధిలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. ఇక్కడ బలం నిరూపించకొనేందకు టీడీపీ, 2019 ఫలితాలను రిపీట్ చేయాలనే లక్ష్యంతో వైసీపీ ఉన్నాయి.
ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ ముఖ్య నేత పార్టీ పదవికి రాజీనామా చేసారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేసారు. డొక్కా కాంగ్రెస్ నుంచి రెండు సార్లు తాడికొండ ఎమ్మెల్యేగా పని చేసారు. మంత్రిగానూ వ్యవహరించారు. ఆ తరువాత టీడీపీ నుంచి ప్రత్తిపాడు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో చేరిన డొక్కాకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ సారి ఎన్నికల్లో డొక్కా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.

తాడికొండ లేదా ప్రత్తిపాడు నుంచి సీటు ఇస్తారని ఆశించారు. కానీ, డొక్కాకు సీటు దక్కలేదు. జగన్ బస్సు యాత్ర సభలో పాల్గొన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీ తరపున ప్రచారంలో మాత్రం దూరంగానే ఉంటున్నారు. కొంత కాలంగా పార్టీ తనతో వ్యవహరిస్తున్న తీరు పైన డొక్కా అసంతృప్తితో ఉన్నారు. డొక్కాకు ఎమ్మెల్సీగా మరో విడత అవకాశం ఇస్తారని భావించినా దక్కలేదు. దీంతో..ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో డొక్కా పార్టీ జిల్లా పార్టీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. డొక్క రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications