డాలర్ శేషాద్రికి గుండెపోటు, సీఎం చంద్రబాబు ఆరా

ఐతే ఆయన ఆరోగ్య పరిస్దితి విషమంగా ఉండటంతో ఆయనను తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఇక తిరుమల ఓఎస్ డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యం నిలకడగా ఉందని టీటీడీ ప్రజాసంబంధాల (పీఆర్ఓ) అధికారి తెలిపారు. కొంతకాలంగా ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని, నెలక్రితం కిడ్నీ సంబంధింత సమస్యలు ఎదుర్కొన్నారని జేఈవో చెప్పారు.
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు ప్రస్తుతం అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. మరోవైపు శేషాద్రి ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఆయనకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
తిరుమలలో ప్రస్తుతం డాలర్ శేషాద్రి ఆఫీసర్ ఆన్ డ్యూటీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. 2006 నుంచి పొడగింపుపై ఆయన పదవిలో కొనసాగుతున్నారు. 2014లో ఆయన పదవిని పొడిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్దానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎమ్ జీ వేణుగోపాల్ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications