విజయ సాయిరెడ్డికి నల్గొండ ఎస్పీ హితవు - గంజాయి ఆపరేషన్ వాస్తవాలివి : రాజకీయాలు సరికాదు..!!
గంజాయి ఆపరేషన్ విషయంలో అసలేం జరిగింది. వాస్తవాలేమిటి.. తెలంగాణ సీఎం చెబితేనే రైడ్స్ చేశాం.. కానీ దీన్ని రాజకీయ అంశంగా ఎందుకు మారుస్తున్నారంటూ తెలంగాణ పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణకు చెందిన ఒక అధికారి అంటూ పేరు ప్రస్తావించకుండానే కొన్ని కామెంట్స్ చేసారు. దీని పైన నల్గొండ ఎస్పీ స్పందించారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో తాము చేపట్టిన గంజాయి ఆపరేషన్ పైన అసత్య ప్రచారం తగదని ఆయన పేర్కొన్నారు.

గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి
పోలీసు విధులను రాజకీయాలతో ముడి పెట్టవద్దని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నెలన్నర కాలంలో నల్లగొండ జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేయడం జరిగిందన్నారు. గంజాయి రవాణాలో పట్టుబడిన నిందితులంతా విచారణలో ఏఓబీ ప్రాంతం నుండి తీసుకు వస్తున్నట్లుగా చెప్పారని రంగనాధ్ వివరించారు. ఇదే విషయాన్ని నిందితుల కాల్ డేటాతో పాటు సాంకేతిక ఆధారాలతో సహా నిర్ధారించినట్లు స్పష్టం చేసారు.

మూలాలు ఏఓబీ వైపు చూపించాయంటూ
తాము గంజాయిపై నిర్వహించిన ప్రతి తనిఖీలో దాని మూలాలు ఏఓబీ వైపు చూపించాయన్నారు. విజయ దశమి రోజున నల్లగొండ జిల్లాకు చెందిన 17 పోలీస్ బృందాలు ఆపరేషన్ గంజా ఇన్ ఏఓబీ ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా విశాఖ రురల్ ఎస్పీ కృష్ణారావు, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు లతో మాట్లాడడం జరిగిందని స్పష్టం చేశారు. నల్లగొండ నుండి డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి ని ప్రత్యేక అధికారిగా ఏఓబీ ప్రాంతానికి వెళ్లిన బృందాలను సమన్వయం చేయడానికి పంపించడం జరిగిందన్నారు.

ఏపీ పోలీసులు సహకరించారు
ఆయన వైజాగ్ రూరల్ జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్ లో మూడు రోజుల పాటు (అక్టోబర్ 15 నుండి 17 వరకు) ఉండి విశాఖ రూరల్ ఎస్పీ ని సైతం కలవడం జరిగిందని తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తి సహాయ, సహకారాలు అందించారని, నేరస్తులను పట్టుకోవడంలో అన్ని రకాలుగా సహకరించారని స్పష్టం చేశారు. ఆక్రోబర్ 17వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబసింగి వద్ద తమ పోలీస్ బృందాలను గంజాయి ముఠాల నుండి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు చేయడం జరిగిందని వివరించారు.
Recommended Video

తమను రాజకీయాల్లోకి లాగవద్దంటూ
ఈ ఆపరేషన్ లో వెయ్యి కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రంగనాధ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు గంజాయి ఆపరేషన్ విషయంలో చేస్తున్న రాజకీయంలో పోలీసులను, ప్రత్యేకించి తనను లాగదం సరికాదని, మా భుజాల మీద నుండి మీ రాజకీయ అస్త్రాలను సంధించడం దురదృష్టకరమని రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము గంజాయి ఆపరేషన్, గంజాయి వ్యాపారం, రవాణా పై చేసిన ప్రకటనలను ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు ఎవరికి కావాల్సిన విధంగా వారు అన్వయించుకుంటూ వారి రాజకీయ ప్రయోజనాల కోసం తమను వాడుకోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications