టీడీపీ ఎమ్మెల్యేలు బఫూన్లా ? అంటూ ఫైర్ అయిన బాబు .. నిరసనగా నల్లచొక్కాతో అసెంబ్లీకి గోరంట్ల

టిడిపి ఎమ్మెల్యేలను బఫూన్లు అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై సభలో జరిగిన చర్చలో, బిల్లును ఆమోదిస్తున్నది లేనిది చెప్పకుండా టిడిపి నాయకులు గందరగోళం సృష్టించి దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. బఫూన్ ల మాదిరిగా స్పీకర్ పోడియం చుట్టూ చేరి నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

జగన్ వ్యాఖ్యలకు నల్ల చొక్కాతో నిరసన తెలియజేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

జగన్ వ్యాఖ్యలకు నల్ల చొక్కాతో నిరసన తెలియజేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

నేడు శాసనసభ సమావేశాలకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నల్లచొక్కాతో వచ్చి తన నిరసన తెలియజేశారు. ఏపీ అసెంబ్లీ లో టీడీపీ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేత కూడా విచక్షణా రహితంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు . సభలో ఉన్న అందరికీ సమానంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం వైసీపీ నేతగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

 టీడీపీ ఎమ్మెల్యేలను బఫూన్లు అన్నా స్పీకర్ వారించలేదని ఫైర్

టీడీపీ ఎమ్మెల్యేలను బఫూన్లు అన్నా స్పీకర్ వారించలేదని ఫైర్

సీఎం సైగ చేయగానే మైక్‌ కట్ చేస్తున్నారని, స్పీకరే రూల్స్‌ కు విరుద్ధంగా సభ నడిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడుతున్నారని చెప్పినా స్పీకర్‌ పట్టించుకోవడం లేదన్నారు. సభా వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలను బఫూన్లు అన్నా స్పీకర్ వారించ లేదని పేర్కొన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు బఫూన్లా? అని బుచ్చయ్య సీరియస్ అయ్యారు.

 కరడుగట్టిన ఆర్ధిక నేరస్తుడు... ఫ్యాక్షన్ కుటుంబం నుండి వచ్చిన వాడు జగన్ అన్న బుచ్చయ్య

కరడుగట్టిన ఆర్ధిక నేరస్తుడు... ఫ్యాక్షన్ కుటుంబం నుండి వచ్చిన వాడు జగన్ అన్న బుచ్చయ్య

ముఖ్యమంత్రి జగన్‌ కరుడుగట్టిన ఆర్థిక నేరస్థుడని, ఫ్యాక్షన్‌ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అందుకే అసెంబ్లీలో సైతం అరాచకాలు సృష్టిస్తున్నాడు అని పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అసెంబ్లీ సమావేశాలకు అర్థం, పర్థం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు, లోకేష్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై చర్చ లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చింది లేదని ఇలాంటి సమావేశాలను ఎన్నడూ చూడలేదని బుచ్చయ్య చౌదరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మేము బఫూన్లైతే...సీఎం జగన్ ఏంటి? అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు

మేము బఫూన్లైతే...సీఎం జగన్ ఏంటి? అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు

ఇక ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మాజీ సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తాను అనని మాటలను అన్నట్లు చూపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.మమల్ని సీఎం బఫూన్లు అని అంటున్నారు...మేము బఫూన్లైతే...సీఎం జగన్ ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. బఫూన్ల కంటే పెద్ద పదం వాడాల్సి వస్తుంది అని ఆయన పేర్కొన్నారు. సభ నడుస్తున్న తీరుపై, సీఎం జగన్ బఫూన్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేటి సభలో టీడీపీ ఆందోళన వ్యక్తం చేసే యోచనలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+