ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ను బస్టాండ్ లోనే చితకబాదిన ఆర్టీసీ డ్రైవర్ .. ఎందుకంటే
ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, లీవ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆర్టీసీ డ్రైవర్ , ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ను చితకబాదిన ఘటన ఏపీలో సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బస్ డిపో లో జరిగిన ఈ ఘటన వివరాలను చూస్తే
ఆర్టీసీ డ్రైవర్ సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి బస్ డిపో అసిస్టెంట్ మేనేజర్ వేణును గత కొంతకాలంగా సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. ఏవో కారణాలు చెప్పి అసిస్టెంట్ మేనేజర్ వేణు, డ్రైవర్ సుబ్రహ్మణ్యంకు సెలవు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆర్టీసీ డ్రైవర్ సుబ్రమణ్యం అసిస్టెంట్ మేనేజర్ వైఖరితో విసుగుచెంది అందరిముందూ గొడవకు దిగాడు. బస్టాండ్ లో ప్రయాణికులు అందరూ చూస్తుండగానే అసిస్టెంట్ మేనేజర్ వేణుపై దాడికి దిగాడు. ఆగ్రహంతో చితకబాదాడు.

బస్ స్టేషన్ లో ఉన్న సిసి కెమెరాలలో డ్రైవర్ అసిస్టెంట్ మేనేజర్ పై చేసిన దాడి ఘటన మొత్తం రికార్డు అయింది. అసిస్టెంట్ మేనేజర్ వేణుపై, డ్రైవర్ చేసిన దాడిని చూసిన అక్కడి ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు ఖంగుతిన్నారు. కావాలని తనకు సెలవు ఇవ్వకుండా అసిస్టెంట్ మేనేజర్ వేణు ఇబ్బంది పెడుతున్నాడని డ్రైవర్ సుబ్రమణ్యం ఆరోపిస్తున్నాడు. డ్రైవర్ తనపై దాడి చేయడంపై అసిస్టెంట్ మేనేజర్ వేణు పోలీసులకు ఫిర్యాదు చేసినా, స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా డిపార్టుమెంటు యాక్షన్ కోసం పై అధికారులకు ఫిర్యాదు చేశారు .
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications