మద్యం తాగొద్దన్న కూతురు: నిప్పు పెట్టిన తల్లి

Drunk mom sets 8-yr-old girl ablaze
నెల్లూరు: మద్యం మత్తులో ఊగిపోతున్న ఓ తల్లి.. తన కన్న కూతురికి నిప్పు పెట్టి సజీవ దహనం చేసింది. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లాలోని చీరాల మండలంలోని ఓబులపల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. తరచూ తనను మద్యం తాగవద్దని ఒత్తిడి చేస్తోందని ఆగ్రహానికి గురైన తల్లి, తన కూతురు హత్యకు పూనుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. చంద్రసేన అనే వివాహిత తన కూతురు శిరీష (8) శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పింటించింది. మద్యం తాగవద్దని ఆమెపై ఒత్తిడి తీసుకురావడం వల్లే తన కూతురు హత్యకు చంద్రసేన పూనుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

కిరోసిన్ పోసి నిప్పింటించడంతో బాధిత బాలిక సహాయం చేయాలని అరుపులు, కేకలు పెట్టింది. దీంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పివేశారు. వెంటనే బాధితురాలిని చేజెర్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 80శాతం కాలిన గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిచింది.

ఘటన జరిగిన సమయంలో బాధితురాలి తల్లి చంద్రసేన మద్యం మత్తులో మద్యం మత్తులో ఊగిపోతోందని స్థానికులు తెలిపారు. కాగా తనకేం తెలియదని చెప్పిన చంద్రసేన, ఆ తర్వాత గ్రామం నుంచి పరారైంది. ఘటనపై చేజెర్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం కేసును మార్చనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+