Tirumala: తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో గుండెపోటుతో డీఎస్పీ మృతి..

తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తోన్న డీఎస్పీ మృతి గుండెపోటేతో మృతి చెందారు. ఈరోజు ఉదయం 1, 805 మెట్టు దగ్గర ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్(59) గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో డీఎస్పీని ఆసుపత్రికి తరలించేలోపే తుది శ్వాస విడిచారు. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం.. కృపాకర్ తిరుమలకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.

కృపాకర్‌ స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి. ఈ ఘటనపై కృపాకర్‌ కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 26న సాయంత్రం తిరుమలకురానున్నారు. ఆదివారం సాయంత్రం రేణికుంట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి అక్కడే బస చేస్తారు. 27వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుపతి విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలకడానికి 26న సీఎం జగన్‌ వెళ్లనున్నట్లు సమాచారం.

DSP died of a heart attack on the stairs of Tirumala

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఆయన.. మధ్యలో శ్రీవారి దర్శనానికి హైదరాబాదు నుంచి తిరుమల వస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, తిరుమలలో బస, వాహనాల కాన్వాయ్‌ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని స్వామి దర్శనం అనంతరం రేణికుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 నుంచి 1:25 వరకు నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అక్కడి నుంచి కరీంనగర్ వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40కి హైదరాబాద్ కు చేరుకుంటారు.సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి ఢిళ్లీ వెళ్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+