ఏపీ స్కూళ్లకు నేటి నుంచి దసరా సెలవులు-ప్రైవేట్ స్కూళ్లు తెరిస్తే ఇలా ఫిర్యాదు చేయండి..
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా స్కూళ్లకు దసరా సెలవులు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ ప్రభుత్వం స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇంకా రాష్ట్రంలోని పలు స్కూళ్లు ఇంకా తెరిచే ఉన్నాయి. పరీక్షల పేరుతో కొన్ని స్కూళ్లు, సిలబస్ పూర్తి కాలేదంటూ మరికొన్ని స్కూళ్లు ఇంకా నడుస్తూనే ఉన్నాయి.
రాష్ట్రంలో దసరా సెలవులు ప్రకటించినా ఇంకా పలు చోట్ల ప్రైవేటు స్కూళ్లు నడుస్తుండటంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ప్రభుత్వం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. సిలబస్ పేరుతోనో, పరీక్షల పేరుతోనే స్కూళ్లను దసరా సెలవుల్లో నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాళ విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఓ ప్రకటన విడుదల చేశారు.

దసరా సెలవుల నేపధ్యంలో అక్టోబర్ 14 వ తేదీ నుండి 24 వ తేదీ వరకూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించిందని ప్రవీణ్ ప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ప్రైవేటు విద్యా సంస్థలు సైతం నడు చుకోవాల్సిందేనని ఇందులో పేర్కొన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా సిలబస్ పూర్తి కాలేదనే నెపంతో, స్టాప్ మీటింగ్, వర్క్ షాప్, రిజిస్టర్ వర్క్ పేరుతో మరియు అదనపు తరగతులు నిర్వహిస్తే ఆ ప్రైవేట్ విద్యా సంస్థల పైన విద్యా శాఖ మండల అధికారులతో పాటు, ఉన్నతాధికారులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు,బాలల హక్కుల కమిషన్ కు పిర్యాదు చేయాలని కోరారు.
ఇలా ఫిర్యాదులు చేసేందుకు అధికారుల ఫోన్ నంబర్లను కూడా విడుదల చేశారు.
1.1902 (కాల్ సెంటర్)
2.1098(child help line)
3. ప్రవీణ్ ప్రకాశ్, ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యా శాఖ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి
0863-2444270
9013133636
పైన పేర్కొబడిన నంబర్స్ కి ఫిర్యాదు చేయవచ్చును...లేదా [email protected] కి మెయిల్ కూడా చేయవచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications