దసరాకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారా ? ఇది మీకోసమే..!

దసరా వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు జనం పరుగులు తీయడం సహజమే. ఈసారి దసరాకు కూడా హైదరాబాద్ నుంచి ఇప్పటికే జనం సొంతూర్లకు తరలి వెళ్తున్నారు. అయితే సొంత వాహనాలు ఉన్న వారి సంగతి సరే. కానీ బస్సులు, రైళ్లలో వెళ్లాలనుకునే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ దసరాకు రావాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది.

విజయవాడలో దసరా ఉత్సవాలకు హైదరాబాద్ నుంచి ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్ధ (ఏపీటీడీసీ) ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాలకు APTDC ప్రత్యేక ప్యాకేజీ కింద వీటిని నడుపుతోంది. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు APTDC చైర్మన్‌ నూకసాని బాలాజీ తెలిపారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్‌ 2 వరకు హైదరాబాద్‌-విజయవాడ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ ఉంటుందన్నారు.

Dussehra Special APTDC Rolls Out Package Buses from Hyderabad to Vijayawada from Today

అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రి పైకి వెళ్లేందుకు 12 సీట్ల మినీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఏపీటీడీసీ చైర్మన్‌ తెలిపారు. ఈనెల 24 నుంచి కొన్ని, 28, 30 నుంచి అక్టోబర్‌ 2 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఉ.5 గంటలకు మియాపూర్‌, 5.20 గంటలకు కేపీహెచ్‌బీ, 5.30కి కూకట్‌పల్లి, 5.50 గంటలకు అమీర్‌పేట్‌, 5.55 గంటలకు బేగంపేట్‌, 6.15 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌, 6.25 గంటలకు ఎల్బీనగర్‌ నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో టికెట్ల బుకింగ్ కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: 77298 30011, 77298 20011 అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+