దువ్వాడ ఎపిసోడ్ .. దివ్వెల మాధురి కారుకు ప్రమాదం; షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే!!

దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం మొగలిరేకులు సీరియల్ ఎపిసోడ్ లలా కొనసాగుతోంది. వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చెలరేగిన వివాదానికి కేంద్రబిందువైన దివ్వెల మాధురి ఈరోజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. టెక్కలి నుంచి పలాస వెళుతుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది.

దివ్వెల మాధురి కారుకు ప్రమాదం
పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న మరో కారుని దివ్వెల మాదిరి కారు ఢీకొట్టడంతో ఈ ఘటనలో మాధురికి గాయాలయ్యాయి .దీంతో ఆమెను స్థానికులు పలాస ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు. అయితే ఈ కారు ప్రమాద ఘటనలో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

Duvvada family episode Divvela Madhuri car accident shocking twist with suicide attempt

ఆత్మహత్యకు ప్రయత్నించానన్న మాధురి
దువ్వాడ వాణి ఆమె కూతుళ్లు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపైన తన పిల్లల పైన ట్రోల్స్ చేస్తున్నారని, దీనిని తట్టుకోలేకపోతున్నానని అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని దివ్వెల మాధురి చెప్పారు ఆసుపత్రికి తరలించిన క్రమంలో బెడ్ పై పడుకొని మీడియాతో మాట్లాడిన మాధురి ఇది రోడ్డు ప్రమాదం కాదని నేనే కావాలని కారును ఢీకొట్టాను అన్నారు.

తనకు బతకాలని లేదని ట్రీట్మెంట్ వద్దని వారిస్తున్న మాధురి
దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో వాణి ఆరోపణలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఆమె తెలిపారు. వైద్యులు చికిత్స చేస్తుంటే తనకు బతకాలని లేదని ట్రీట్మెంట్ వద్దని మాధురి వైద్యులను వారిస్తున్నారు.కాగా దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేత మాధురి మీడియాతో మాట్లాడారు.

దువ్వాడ తాను కలిసే ఉంటామన్న మాధురి
దువ్వాడ శ్రీనివాస్ నేను కలిసే ఉంటామని మా బంధాన్ని రాజకీయ కోణంలో చూడవద్దంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఎవరు మా వ్యక్తిగత జీవితాల్లోకి రాకూడదని పేర్కొన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను తల్లి కూతుర్లు ఇంటి నుంచి గెంటేసారని మాధురి ఆరోపించారు. కావాలని తనను దువ్వాడ వాణి ఆమె కూతుళ్లు బజారుకీడుస్తున్నారని నిప్పులు చెరిగారు.

ఈ ఫ్యామిలీ పంచాయితీ ఏ రూపు తీసుకుంటుందో
ఇక తాజాగా వీరి ఎపిసోడ్లో చోటు చేసుకుంటున్న సంఘటనలు ఈ పంచాయతీ చిలికిచిలికి గాలివానగా మారింది అన్న సంకేతాలను ఇస్తోంది. దివ్వెల మాధురి కూడా ఏమాత్రం తగ్గకుండా వాణి పైన సంచలన ఆరోపణలు చేయడంతో ముందు ముందు ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+