ద్వారంపూడిది నేర చరిత్ర... జగన్ బినామీ .. పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గలేదు. ఈ నేపధ్యంలో ద్వారంపూడిపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు . సీఎం జగన్‌కి ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బినామీ అని ఆమె ఆరోపించారు. జగన్ సొంత పత్రిక కార్యాలయాలు ద్వారంపూడి పేరు మీద ఉన్నాయని ఆమె ఆరోపణలు గుప్పించారు . కాకినాడలో ద్వారంపూడి కుటుంబ దందాలకు అంతే లేదని, నేరచరిత్ర ఉన్న వ్యక్తి ద్వారంపూడి అని పంచుమర్తి అనూరాధ పేర్కొన్నారు.

 చంద్రబాబు కాలిగోటికి కూడా ద్వారంపూడి సరిపోడన్న అనూరాధ

చంద్రబాబు కాలిగోటికి కూడా ద్వారంపూడి సరిపోడన్న అనూరాధ

ద్వారంపూడి తనంత నిజాయితీపరుడు లేడని అనుకుంటున్నాడని ఆయన నిజస్వరూపం ఏంటో నియోజకవవర్గ ప్రజలకు తెలుసని విమర్శించారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. ఇక చంద్రబాబు కాలిగోటికి కూడా సరిపోని ద్వారంపూడి ఆయనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషి చంద్రబాబు అని ఆమె చెప్పుకొచ్చారు. ద్వారంపూడికి చంద్రబాబును అనే అర్హత లేదని ఆమె ఫైర్ అయ్యారు.

ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి నేర చరిత్రపై పుస్తకమే రాయొచ్చు

ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి నేర చరిత్రపై పుస్తకమే రాయొచ్చు

చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి ద్వారంపూడికి లేదన్నారు. ద్వారంపూడి నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. హైపవర్ కమిటీ మీటింగ్ పేరుతో కోర్టుకు వెళ్లకుండా జగన్ డ్రామాలాడుతున్నారని పంచుమర్తి ఆరోపించారు.కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి నేర చరిత్రపై పుస్తకమే రాయొచ్చని పేర్కొన్న ఆమె ఆయన చరిత్ర మొత్తం అవినీతి మయమే అని విమర్శించారు.

రేషన్ బియ్యాన్ని అక్రమంగా షిప్పుల్లో విదేశాలకు తరలించిన చరిత్ర అని ఫైర్

రేషన్ బియ్యాన్ని అక్రమంగా షిప్పుల్లో విదేశాలకు తరలించిన చరిత్ర అని ఫైర్

2004 నుంచి దొమ్మీలు , హత్యాయత్నం వంటి లెక్కలేనన్ని కేసులు ద్వారంపూడిపై ఉన్నాయని ఆమె ఆరోపించారు. ద్వారంపూడి తండ్రి అనపర్తిలో దొంగనోట్లు ముద్రించి చెలామణీ చేసేవాడని ఆరోపించారు.రేషన్ బియ్యాన్ని అక్రమంగా షిప్పుల్లో విదేశాలకు తరలించిన చరిత్ర మీది అని పంచుమర్తి విరుచుకుపడ్డారు . పేకాట క్లబ్‌లో గతంలో ఓ మంత్రిని గన్‌తో ద్వారంపూడి బెదిరించారని ఆమె ఆరోపించారు .

రాష్ట్రానికి జగన్‌ అనే చీడ పట్టిందన్న పంచుమర్తి

రాష్ట్రానికి జగన్‌ అనే చీడ పట్టిందన్న పంచుమర్తి

రాష్ట్రానికి జగన్‌ అనే చీడ పట్టిందని ఆమె ఘాటుగా విమర్శించారు . అది వదిలినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని అనురాధ వ్యాఖ్యానించారు.చమురు కంపెనీలకు సంబంధించి పైప్‌లైన్‌ను కట్‌ చేసి నిస్సుగ్గుగా ఆయిల్‌ను దొంగతనం చేసి దాన్ని అమ్ముకుని బతికే మీరు చంద్రబాబునాయుడు గురించి మట్లాడుతారా? అని మండిపడిన అనూరాధ ద్వారంపూడిని తూర్పారబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+