వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు బినామీలు..పెయిడ్ ఆర్టిస్ట్‌లు: పవన్ కూట్రపూరిత వ్యాఖ్యలు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి!

|
Google Oneindia TeluguNews

రాజధాని తరలింపు ప్రతిపాదనల పైన 15 రోజులుగా నిరసనలు..ఆందోళనలు చేస్తున్న అమరావతి ప్రాంత స్థానికులు..రైతులపైన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే రాజధాని ప్రాంతం పైనా..ఆందోళన చేస్తున్న తమ పైనా అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పైన అమరావతి ప్రాంత స్థానికులు మండిపడుతున్నారు.

వారికి మద్దతుగా వైసీపీ మినహా అన్ని రాజకీ య పార్టీలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..జనసేన అధినేత పవన సైతం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.ఇదే సమయంలో నారాయణ స్వామి అదే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో సారి చర్చకు కారణమయ్యాయి.

DY CM Naryana Swamy comments on Amaravati Farmers became controversy

బినామీలు..పెయిడ్ ఆర్టిస్టులు

అమరావతి లో ఆందోళన చేస్తున్నవారిలో కొందరు చంద్రబాబు బినామీలైతే, మరికొందరు పెయిడ్‌ ఆర్టిస్టులని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న ఆలోచనతోనే సీఎం 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారని, ఆ దిశగా క మిటీని వేశారని తెలిపారు. వైసీపీ నేతలు కొందరు ఇదే రకమైన వ్యాఖ్యలు చేయటం పైన ఆ ప్రాంతంతో నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిలో ఆగ్రహానికి కారణమైంది.

తామంతా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులమని స్పష్టం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఎక్కడో ఉండి వ్యాఖ్యలు చేయటం కాదని..తమ మధ్యకు వచ్చి తాము రైతులమో కాదో..చూసి మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ తమ్మినేని..బొత్సా..పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల పైన వారు మండిపడుతున్నారు. తాజాగా..డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు.

పవన్ వ్యాఖ్యలు కూట్రపూరితం..

తామంతా ఒక్కటైతే జగన్‌ ఓడిపోయి ఉండేవారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన కుట్రపూరి త మనస్తత్వాన్ని బయటపెట్టాయని చెప్పారు. చంద్రబాబు, పవన్‌లాంటి వాళ్లు లక్షమంది ఒక్కటైనా జగన్‌ను ఏమీ చేయలేరన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశానికి నారాయణ స్వామి మద్దతు ప్రకటించారు.

అక్కడ ఆందోళన చేస్తున్న రైతుల పైన తమ కేబినెట్ లోని వారు ఇప్పటికే చేసిన వ్యాఖ్యల పైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు డిప్యూటీ సీఎం సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేసారు. ఇక, ఇప్పుడు తమ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ కు కట్టుబడి ఉందని నారాయణ స్వామి స్పష్టం చేసారు.

English summary
Depurty CM Narayasan Swamy key comments on Amaravati farmers. He says CBN binamies and paid artists participating in agitation against three capitals proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X