బెదిరిస్తే సహించం, తాటతీస్తాం - వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్ ..!!
డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికారంలో ఉన్న సమయంలోనే ఏం చేయలేకపోయారు.. ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. బెదిరింపులకు భయపడేది లేదని... యూపీ సీఎం యోగీ మార్క్ ట్రీట్మెంట్ అవసరమని వ్యాఖ్యానించారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే తాట తీస్తాం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీని టార్గెట్ చేసారు. పెరవలిలో
అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా 1.2కోట్ల ప్రజలకు నీరు అందనుందని, 30నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని పవన్ చెప్పారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములను ఒక కూలానికే, నెల్లూరుకే పరిమితం చేశారని, ఆయన ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారని, అటువంటి మహనీయుడికి సరైన గౌరవం ఇవ్వాలని నిర్ణయించామని, మహనీయులకు కులాలు చూడకూడదని పవన్ పేర్కొన్నారు. జనసైనికులు క్రమశిక్షణతో ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. తాను ఉన్న సభలకు ప్రధానికూడా రావడానికి భయపడుతున్నారని పవన్ అన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం గత ఎన్నికల సమయంలో తగ్గి ఉన్నాను. చాలా మంది.. పార్టీని అమ్మేశారని, ఇంకా ఏదోదో కామెంట్స్ చేశారు. అయినా నేను పట్టించుకోలేదు. కేవలం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నేను తగ్గానని పవన్ స్పష్టం చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని కొంతమంది ఇప్పుడు కులాలు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరి బెదిరింపులకు పవన్ కల్యాణ్ బయపడడు.. ఇంటిలో నుండి బయటకు వచ్చే సమయంలోనే నేను తిరిగి వెళ్తాననే నమ్మకం లేదు అనే భావనతోనే నేను బయట వస్తానని వ్యాఖ్యానించారు. అనవసరంగా ఆరోపణలుచేసే కిరాయి గ్యాంగ్‌లకు యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్ లాగా ట్రిట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు. వీరు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారని నిలదీసారు. రాష్ట్రంలో రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేసారు. వైసీపీ నేతలలో కొంతమంది అంటే నాకు గౌరవం ఉంది. కానీ, కొంతమంది పద్దతి మార్చుకోవడం లేదు. బాధ్యత లేకుండా, ఒళ్లు తెలియకుండా ప్రవర్తించే వ్యక్తుల తాట తీస్తాం అంటూ హెచ్చరించారు.
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications