వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులను అప్రమత్తం చేసి కిడ్నాపర్ల చెర నుండి మహిళను కాపాడిన యువకుడు

ఓ కారు అనుమానాస్పదంగా వెళ్ళడాన్ని గమనించిన యువకుడు కారును వెంబడించి కిడ్నాప్ ప్రయత్నం నుండి ఓ కంపెనీ యజమానిని రక్షించాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కొత్తపల్లి: ఓ కారు అనుమానాస్పదంగా వెళ్ళడాన్ని గమనించిన యువకుడు కారును వెంబడించి కిడ్నాప్ ప్రయత్నం నుండి ఓ కంపెనీ యజమానిని రక్షించాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటుచేసుకొంది.

రోడ్డుమీద ఓ కారు వేగంగా వెళ్లోంది.అయితే అదే సమయంలో హఠాత్తుగా కారు రోడ్డుపైనే ఆగిపోవడం, కారులో ఇద్దరు యువకులు ఎక్కడంతో ఆ యువకుడికి అనుమానం వచ్చింది.

East godavari police arrested two persons for kidnap attempt

కారును తన బైక్ పై ఫాలో అయ్యాడు.అయితే కారునుండి ఓ మహిళ తప్పించుకొనే ప్రయత్నం చేస్తుండడాన్ని అతను గమనించాడు.అయితే వెంటనే ఆ యువకుడు పోలీసులకు సమాచారమిచ్చాడు.

కాకినాడకు చెందిన యాక్ట్ షిప్పింగ్ పార్వర్డు కంపెనీ యజమాని వీర వెంకటసత్యసాయి భార్య ధనలక్ష్మి కంపెనీ సిఈఒగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతిరోజూ కాకినాడ కల్పన సెంటర్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి , దుమ్ములపేట మీదుగా పోర్టు సమీపంలో ఉన్న కంపెనీ కార్యాలయానికి వెళ్తుంటారు.

అప్పటికే ఆమెను కిడ్నాప్ చేసేందుకు పన్నాగం పన్నిన డ్రైవర్ దయ వైఎస్ఆర్ బ్రిడ్జి మీదుగా తీసుకెళ్లాడు. కారు వేరే మార్గంలో వెళ్తుండడంతో అనుమానం వచ్చి అలా వెళ్ళాల్సింది. ఇలా వెళ్లున్నావేమిటని ధనలక్ష్మి అడిగింది.

అదే సమయంలో ముఖాలకు ముసుగులు వేసుకొన్న ఇద్దరు వ్యక్తులు అదే కారులోకి చేరో వైపు ఎక్కి కూర్చొన్నారు.కత్తిపెట్టి ఆమెను బెదిరించారు. కారును స్పీడుగా వాకలపూడి మీదుగా కాకినాడ బీచ్ రోడ్డు వైపు తీసుకెళ్ళాడు.

అక్కడ నుండి తుని వైపు వెళ్ళి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ ఓ రహస్య ప్రదేశంలో ఆమెను దాచి రూ.50 లక్షలు డిమాండ్ చేయాలని కిడ్నాపర్లు వ్యూహం పన్నారు.

అయితే కల్పన సెంటర్ నుండి కారు అతి వేగంగా వెళ్తుండడం,. ఓ మహిళ కారులో నుండి తప్పించుకొనే ప్రయత్నం చేయడంతో ఆ యువకుడు కారును వెంబడించాడు. వెంటనే తన సెల్ ఫోన్ నుండి పోలీసులను అప్రమత్తం చేశాడు.

కాకినాడ నుండి బీచ్ రోడ్డుమీదుగా వస్తున్న కారును ఉప్పాడలో పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కానీ, ఆ కారు ఆపకుండా వేగంగా వెళ్ళడంతో వెంబండించిన పోలీసులు కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపేటవాసులకు సమాచారం ఇవ్చారు. ఓ లారీని రోడ్డుకు అడ్డుగా పెట్టి కారును అడ్డుకొన్నారు.

అయితే కారును వదిలి డ్రైవర్ దయ పారిపోయాడు. మమ్మల్ని వదలకపోతే మహిళను చంపేస్తామని బెదిరించారు.అయితే స్థానికులు చాకచక్యంగా కిడ్నాపర్లను పట్టుకొన్నారు.

English summary
East godavari police arrested two persons for kidnap attempt on Monday. Three persons for kidnaping attempt Act shipping forward company CEO Dhanalaxmi, police arrested three persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X