రోడ్ షోతో కోడ్ ఉల్లంఘన: బాలకృష్ణకు నోటీసు
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సోమవారం శ్రీకాకుళం జిల్లా చేరుకున్న నందమూరి బాలకృష్ణ ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించటంతో నరసన్నపేట రిటర్నింగ్ అధికారి నోటీసిచ్చారు. ఎన్నికల కమిషన్ నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలో సినీనటుడు, తెలుగుదేశం నేత నందమూరి బాలకృష్ణకు నోటీసు జారీ చేశామని నియోజకవర్గ ఎన్నికల అధికారిణి తనూజారాణి తెలిపారు.
సోమవారం పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలాకి, ఉర్లాం ప్రాంతాల్లో బహిరంగ సభలు మాత్రమే ఏర్పాటు చేస్తామంటూ అనుమతి తీసుకున్నారని చెప్పారు. దీనికి ఎన్నికల కమిషన్‌తోపాటు జిల్లా కలెక్టర్ కూడా డిఆర్వో ద్వారా అనుమతి ఇచ్చారని చెప్పారు. కానీ, మడపాం బ్రిడ్జినుంచి జాతీయ రహదారి, సత్యవరం మీదుగా నరసన్నపేట చేరుకుని పోలాకి ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ రోడ్‌షో నిర్వహించగా వీడియో క్లిప్పింగ్‌లను సేకరించినట్టు వెల్లడించారు.

ఈ విషయమై బాలకృష్ణతోపాటు, టిడిపి పార్లమెంటు అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అసెంబ్లీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి నోటీసులు జారీ చేశామన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదించామని, ఈమేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా జిల్లాకు సినీగ్లామర్ ప్రచారం అచ్చిరాన్నట్టు కనిపిస్తోంది. గతంలో సినీనటుడు మోహన్‌బాబు రోడ్‌షో నిర్వహిస్తుండగా రణస్థలం వద్ద అధికారులు అడ్డుకోగా ఎన్నికల అధికారిపై చేయి చేసుకున్నారు. దీనిపై అప్పటి పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేయడం సంచలనానికి దారితీసింది. సినీ గ్లామర్‌కు ఓట్లు రాలుతాయో లేదో తెలీదుగానీ వారికి మాత్రం పోలీసు కేసులు తప్పడం లేదంటూ సామాన్యులు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications