ఓటు వేయబోతున్నారా, నో టెన్షన్ - ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!
ఏపీ ఎన్నికల్లో మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవటానికి తుది ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఓటింగ్ పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఓటర్లకు ఓటింగ్ స్లిప్పులు అందాయి. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఏపీలో ఓటు హక్కు ఉన్న వారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఓటు వేసేందుకు వచ్చే వారు సులభంగా ఓటు వేయటానికి ఎన్నికల సంఘం పలు కీలక సూచనలు చేస్తోంది.
ఇలా చేయండి
ఇప్పటికే ఓటరు స్లిప్పు అందకపోయినా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటరు తమ పేరును ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి. అక్కడ ఓటరు స్లిప్పును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎపిక్ కోడ్ లేకుంటే మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినా వివరాలు తెలుస్తాయి.

ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లకున్నా.. మీ ఫోన్‌లోనే సెర్చ్ చేసుకుని.. బూత్‌దగ్గరకు వెళ్తే.. అక్కడ స్లిప్పు ఇస్తారు. మీ పోలింగ్ బూత్ నెంబర్ దానిపై ఉంటుంది. మీదగ్గర ఓటరు గుర్తింపు కార్డు ఉంటే ఓకే.. లేకుంటే.. 13 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా పోలింగ్ బూత్‌లో చూపించవచ్చు. అదే సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి.
గుర్తింపు కార్డు అవసరం
13 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా పోలింగ్ బూత్‌లో చూపించవచ్చు. అందులో ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, భారతీయ పాస్‌పోర్టు, ఫొటో ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్‌బుక్, సర్వీస్ ఐడీ కార్డు, NPR స్మార్ట్ కార్డు, MNREGA జాబ్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, ఫొటో గల పెన్షన్ పత్రాలు, కేంద్రం జారీ చేసిన డిసేబిలిటీ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యేల ఐడీ కార్డులలో ఏదో ఒకటి చెల్లుతుంది.
మీకు ఇచ్చే ఓటరు స్లిప్పు గుర్తింపు కాదు. దానికి అదనంగా ఇప్పుడు చెప్పిన కార్డుల్లో ఒకదాన్ని తీసుకెళ్లాలి. అందరిదగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి.. ఓటరు స్లిప్పుతో పాటు ఆ కార్డు ఉంటే చాలు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తరువాత మీ వివరాలు పరిశీలిస్తారు.

ఓటింగ్ ఇలా
ఆ వెంటనే ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు. మీ వివరాలను ఫామ్ 17Aలో నమోదు చేస్తారు. ఆసమయంలో ఓటరు జాబితాలో మీ బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు. అనంతరం మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌కు వెళ్లడానికి అనుమతిస్తారు. ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటేసే ఈవీఎం మెషీన్, దాని పక్కనే వీవీప్యాట్ ఉంటుంది.
మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కన్నే ఉన్న బ్లూ కలర్ బటన్‌ను నొక్కితే మీ ఓటు నమోదైనట్లు లెక్క. బటన్ నొక్కిన తరువాత అయిదు సెకన్ల పాటు బీప్ సౌండ్ వినిపిస్తుంది. ఆ వెంటనే VVPAT మెషీన్‌పై పచ్చటి లైట్ వెలిగి.. లోపల స్లిప్ కనిపిస్తుంది. మీరు ఎవరికి ఓటేశారో వారిపేరు, సీరియల్ నెంబర్, పార్టీ గుర్తు దానిపై కనిపిస్తాయి. ఈ కాగితపు స్లిప్ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. ఆ తరువాత ఈ స్లిప్ బాక్స్‌లోకి పడిపోతుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications