Exit Poll Peoples Pulse: ఏపీలో అధికారం వారిదే-తేల్చేసిన ఎకనామిక్ టైమ్స్ ఎగ్జిట్ పోల్..!

ఏపీలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు ఇప్పటికే విడుదలైన పలు ఎగ్డిట్ పోల్స్ సూచిస్తున్నాయి. అయితే ఇందులో ఎవరికి అధికారం దక్కుతుందనే అంశంపై మిశ్రమ ఫలితాలు విడుదల చేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార వైసీపీకే పట్టం కట్టగా.. మరికొన్ని మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని తేల్చేశాయి. అలాగే జాతీయ మీడియా సంస్థలు మాత్రం కూటమికి ఎక్కువగా ఎంపీ సీట్లు వస్తున్నాయని తేల్చాయి.

ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ కు చెందిన పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది. ఇందులో విపక్ష ఎన్డీయే కూటమికి ఏకంగా 111 నుంచి 135 సీట్లు లభించబోతున్నట్లు వెల్లడించింది. అలాగే అధికార వైసీపీ 45-60 సీట్లకు పరిమితం కాబోతుందని తెలిపింది. దీంతో లోక్ సభ సీట్లతో పాటు అసెంబ్లీ సీట్లలోనూ కూటమి ఆధిపత్యం కొనసాగుతున్నట్లు జాతీయ మీడియా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

economic times s Peoples Pulse exit poll predicts power to nda in Andhra with 135 seats

మరోవైపు టైమ్స్ కే చెందిన టైమ్స్ నౌ జాతీయ ఛానల్ ఈటీజీతో కలిపి చేసిన ఎగ్జిట్ పోల్ లో మాత్రం వైసీపీ 13 నుంచి 15 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొనడం విశేషం. ఇందులో కూటమికి 12 ఎంపీ సీట్లు ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగి లోక్ సభకు ఒకలా, అసెంబ్లీకి మరోలా ఓటర్లు ఓటేసినట్లు అర్థమవుతోంది. అయితే ఇలా జరిగే అవకాశాలు దాదాపు లేవని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+