హవాలా పట్టివేత: హీరా గ్రూప్ సంస్థల్లో ఈడి సోదాలు

హీరా గ్రూప్‌పై ఇది వరకే తమ వద్ద ఓ ఫిర్యాదు ఉండడంతో ఈడి అధికారులు షేక్ నవషేరాకు చెందిన కార్యాలయాలపై దాడులు సాగిస్తున్నారు. హైదరాబాదులోని టోలీచౌక్‌లో గల ప్రధాన కార్యాలయంలో, మెహిదీపట్నంలోని ఓ కంపెనీలో సోదాలు జరుగుతున్నాయి.
హవాలా మార్గంలో డబ్బును తరలించే ప్రయత్నంలో హీరా గ్రూప్‌నకు చెందిన క్యాషియర్ సోమవారం వట్టుబడినట్లు సమాచారం. హీరా గ్రూప్ ఆధ్వర్యంలో తిరుపతి సమీపంలో అంతర్జాతీయ ఇస్లామిక్ విశ్వవిద్యాలయ స్థాపనకు పూనుకున్నారు. అప్పటిలో ఇది వివాదంగా మారింది.
ఇస్లామిక్ విశ్వవిద్యాలయం స్థాపన పేరుతో షేక్ నవాషీరా ఒక్కొక్కరి నుంచి 20 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు అధికారవర్గాలు చెప్పాయి. విశ్వవిద్యాలయంలో వచ్చిన లాభాల్లో యాభై శాతం లాభాన్ని పంచిస్తానంటూ ఆమె ఆ డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications