నంద్యాల ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల, ఆగష్టు 23న, పోలింగ్
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ గురువారంనాడు విడుదలైంది. ఈ ఏడాది ఆగష్టు 23వ, తేదిన ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 28న, కౌంటింగ్ జరగనుంది.
అమరావతి: నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ గురువారంనాడు విడుదలైంది. ఈ ఏడాది ఆగష్టు 23వ, తేదిన ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 28న, కౌంటింగ్ జరగనుంది.
ఈ ఏడాది మార్చి 12వ, తేదిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణించడంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఈ ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం నాడు ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ నెల 29న, నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 29వ, తేదినుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగష్టు 5వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సాగుతోంది.

9వ, తేదివరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంటుంది. ఆగష్టు 23వ, తేదిన ఎన్నికలు నిర్వహిస్తారు. ఆగష్టు 28వ,తేదిన కౌంటింగ్ నిర్వహిస్తారు. తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఈ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మనందరెడ్డి బరిలోకి దిగారు. వైసీపీ నుండి మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి బరిలో నిలిచారు.












Click it and Unblock the Notifications