సుప్రీం ఆదేశాలతో, ఆ 19 మున్సిపాల్టీల్లో - SEC కీలక నిర్ణయం, డెడ్ లైన్..!!

స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుతో మున్సిపల్ ఎన్నిక ల విత్ డ్రా సమయం ముగిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇదే సమయంలో తమకు నామినేషన్లు వేసేందుకు అవకాశం లేకుండా దాడులు చేసారంటూ వైసీపీ దాఖలు చేసిన పిటీషన్ పైన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. ఎస్ఈసీ సుప్రీం ఆదేశాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

19 మున్సిపాల్టీల్లో నామినేషన్ల గడువు పెంపు పై సుప్రీం అసలు ఏం చెప్పింది..!?
19 మున్సిపాల్టీల్లో నామినేషన్ల గడువు పెంపు పై సుప్రీం అసలు ఏం చెప్పింది..!?

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ చోటు చేసుకున్న ఘటనల పై వైసీపీ నేతలు సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. దీంతో.. సుప్రీంకోర్టు వైసీపీ ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని.. 25 వ తేదీ వరకు పోటీ అభ్యర్ధుల జాబితా వెల్లడించవద్దని స్పష్టం చేసింది. దీంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమయ్యారు. న్యాయనిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణపై సమీక్షించారు. ఈ క్రమంలో 19 ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సందర్భంగా జరిగిన పరిణామా లపై ఎస్​ఈసీ నివేదికలు తెప్పించుకుంటోంది.

 ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!
ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!
Election Commission Seeks Reports from Collectors on Incidents in 19 Municipalities

జిల్లా అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహిం చిన ఎన్నికల సంఘం ఈ సాయంత్రం లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు తిరిగి చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా ఈ రోజు రాత్రి లేదా రేపు ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకటించనుంది.

వైసీపీ ఫిర్యాదు మేరకు కనిగిరి, దర్శి, పుంగనూరు, రాయచోటి, రాజంపేట, మైదుకూరు, ఎర్ర గుంట్ల, ప్రొద్దుటూరు, పిడుగురాళ్ల, తాడిపత్రి, గురజాల, కమలాపురం, దాచేపల్లి, జమ్మల మడుగు, తిరుపతి, బద్వేల్‌, పులివెందుల, కడప, గుత్తి తదితర ప్రాంతాల్లో నామినేషన్లకు సంబంధించి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోనుంది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటన గడువును ఈనెల 25 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. కోర్టు ఆదేశాలపై తీసుకున్న చర్యలపై ఈనెల 27న రిపోర్టు ఇవ్వాలని ఎస్​ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో.. జిల్లాల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+