ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న హింసపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమి దాడులతో తమ పార్టీ అభ్యర్ధుల నామినేషన్లు అడ్డుకుందని, కాబట్టి నామినేషన్లు వేసే గడువు పొడిగించాలని, తమ అభ్యర్ధులకు తగిన భద్రత కల్పించాలని, జిల్లా కేంద్రాల్లో నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని వైసీపీ (YSRCP) దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

పులివెందుల పోలీసు కాల్పుల కేసులో బిగ్ టర్న్- వైసీపీ అనూహ్య డిమాండ్..!
పులివెందుల పోలీసు కాల్పుల కేసులో బిగ్ టర్న్- వైసీపీ అనూహ్య డిమాండ్..!

రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయా చోట్ల నామినేషన్ల గడువు పొడిగింపుపై రేపటి లోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ మోహనతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. శాంతిభద్రతల సమస్యల కారణంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేని పట్టణ స్థానిక సంస్థలలో, పిటిషనర్, ఇతర అభ్యర్థులు సమర్పించిన విజ్ఞాపనలను, పత్ర, ఎలక్ట్రానిక్ ఆధారాలతో పాటు ఎస్‌ఈసీ పరిశీలించి, నామినేషన్ల గడువును పొడిగించాలా వద్దా అని నిర్ణయించాలని తెలిపింది. దీంతో పాటు జిల్లా కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలన్న వైసీపీ విజ్ఞప్తిపైనా సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని, వైఎస్సార్సీపీ అభ్యర్ధులకు జిల్లా ఎస్పీలు తగు భద్రత కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Relief for YSRCP as Supreme Court Extends Nomination Deadline in 19 AP Municipalities
వైసీపీ పిటిషన్ పై సుప్రీం కీలక నిర్ణయం..! ప్రత్యేక విచారణ..!
వైసీపీ పిటిషన్ పై సుప్రీం కీలక నిర్ణయం..! ప్రత్యేక విచారణ..!

ఎక్కడైతే గడువు పొడిగింపు మంజూరు చేశారో అక్కడ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆ నిర్ణయం ప్రచురించిన తేదీ నుండి కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని, దానికి అనుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించాలని తెలిపింది. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేయడానికి ముందుకు వచ్చే అభ్యర్థులకు తగినంత పోలీసు బందోబస్తు, సీసీటీవీ కవరేజ్, రక్షణ ఉండేలా డీజీపీ ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఒక నివేదికను సమర్పించాలని తెలిపింది. పిటిషనర్, ఇతర భాగస్వాముల ఆందోళనలను పరిష్కరించడానికి, అర్హులైన అభ్యర్థులందరికీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి స్వేచ్ఛాయుత , నిష్పక్షపాత అవకాశం ఉండేలా చూసేందుకు, ఎస్ఈసీ అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని, తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎస్ఈసీ తన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించాలని, దీనిపై అక్టోబర్ 27న తిరిగి విచారణ జరుపుతామని తెలిపింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో హింసపై పోలీసులకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పడాన్ని తప్పుబట్టింది. దీన్ని బట్టి ఎంత దారుణమైన పరిస్ధితి ఉందో అర్దమవుతోందని పేర్కొంది. హింస జరుగుతుంటే, శాంతి భద్రతలు లేకపోతే నామినేషన్లు వేసేందుకు ఎవరు వస్తారంటూ వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు సమాన అవకాశం ఉండాలని, ప్రతిపక్షాలకూ తగిన అవకాశం ఉండాలని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+