అవి సరిపోతేనే ఫలితాల వెల్లడి: ఐదారు గంటల సమయం అవసరం : సీఈవో ద్వివేదీ..!
పోటీలో ఉన్న అభ్యర్దులకు ఈనెల 23న ఫలితాలకు ఎక్కువ సేపు నిరీక్షించాల్సిందే. ఈ సారి ఎన్నికల ఫలితాలు ఆలస్యం అవుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేసారు. ర్యాండమ్‌గా ఒక్కో నియోజకవర్గంలో పది పోలింగ్ బూత్‌ల్లో వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఆ తరువాతనే ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు.
ఆ రెండు సరిపోయినాకే..
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంలలో పోలైన ఓట్లతో పాటుగా వీవీప్యాట్ స్లిప్పులు సైతం లెక్కిస్తామని ఆ తరువాత మాత్రమే ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ స్పష్టం చేసారు. ఈ సారి కొత్తగా వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కారణంగా ఎన్నికల ఫలితాల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.
ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1750 వీవీ ప్యాట్ స్లిప్పుల్ని లెక్కించాల్సి ఉంటుందన్నారు. సగటున ఒక్కో అసెంబ్లీ పరిధిలో ఫలితాల వెల్లడికి సగటున ఐదారు గంటలకుపైగా సమయం పడుతుందని సీఈవో వివరించారు. ప్రత్యేక అధికారులకు మాత్రమే వీటి లెక్కింపు అధికారం ఉందని స్పష్టం చేసారు.

ర్యాండమ్ విధానంలో లెక్కింపు
ఈ సారి ఈవీఎంలతో పాటుగా వీవీప్యాట్స్ స్లిప్పులను లెక్కించాల్సి ఉండటంతో ర్యాండమ్ విధానంలో ఎంపిక చేస్తామని చెప్పుకొచ్చారు. కౌంటింగ్ నాడు ఉదయం అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో వీవీప్యాట్‌ల ర్యాండమైజేషన్ ఉంటుందన్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వీవీప్యాట్‌లు వినియోగించామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ... ఐదు లోక్‌సభ వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు ఉంటుందని చెప్పారు. ఒక్కో వీవీప్యాట్‌లో సుమారు వెయ్యి ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని వివరించారు. అయితే, 50 శాతం వీవీప్యాట్స్ స్లిప్పులు లెక్కించాలంటూ కొందరు సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసారు. సుప్రీం కోర్టులో విచారణ తరువాత దీని పైన నిర్ణయం మారి..మరి కొన్ని లెక్కించాల్సి వస్తే ఫలితాలు మరింతగా అలస్య అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications