అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు కీలక నివేదిక అందజేసిన రాబిన్ శర్మ!

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి. ఆ పార్టీకి రెండో ఆప్షన్ లేదు. ఈసారి కనుక అధికారంలోకి రాలేకపోతే టీడీపీని బలహీనం చేసి ఆ స్థానంలోకి రావాలని భారతీయ జనతాపార్టీ ప్రణాళికలు వేసుకుంటోంది. రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ చంద్రబాబు వ్యూహకర్తను నియమించుకున్నారు.

వ్యూహకర్త అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు

వ్యూహకర్త అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు

వ్యూహకర్తల అవసరం లేకుండానే ఇప్పటివరకు చంద్రబాబు విజయం సాధిస్తూ వచ్చారు. ప్రధాన మీడియాలో మద్దతున్నప్పటికీ సోషల్ మీడియాలో వెనకబడి ఉండటంతోపాటు వైసీపీ వేస్తున్న ఎత్తులను సమర్థవంగా తిప్పికొట్టాలంటే వ్యూహకర్త అవసరమని భావించారు. ఆ మేరకు పీకే టీంలో పనిచేసి బయటకు వచ్చి సొంత సంస్థ పెట్టుకున్న రాబిన్ శర్మకు బాధ్యతలు అప్పగించారు.

మానిఫెస్టో రూపకల్పనలో రాబిన్ శర్మ

మానిఫెస్టో రూపకల్పనలో రాబిన్ శర్మ

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మినీ మహానాడులు, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలు రాబిన్ శర్మ రూపొందించినవే. ఈ కార్యక్రమాలవల్ల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనడంతోపాటు కీలకమైన ప్రాంతాల్లో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుండటంతో చంద్రబాబు ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు. అభ్యర్థులకు సంబంధించి నియోజకవర్గాల్లో సర్వే చేస్తుండంటంతోపాటు పార్టీ మానిఫెస్టో రూపకల్పనలో రాబిన్ శర్మ టీం బిజీగా ఉంది.

పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను పార్టీ నాయకులెవరూ సక్రమంగా చేయడంలేదని, ప్రధానంగా బూత్ ఇన్ ఛార్జిల నియామకంలోకూడా నాయకులంతా అలసత్వంతో ఉన్నారని, దాదాపు 80 శాతం బూత్ ఇన్ ఛార్జి పదవులు ఖాళీగా ఉన్నాయని రాబిన్ శర్మ టీం నివేదిక అందజేసింది.

నాయకులపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

నాయకులపై నిప్పులు చెరిగిన చంద్రబాబు


ఈ నివేదికపై చంద్రబాబు నాయకులపై మండిపడ్డారు. బూత్ ఇన్ ఛార్జిలను పెట్టుకోకుండా ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా పోటీచేసే బలం ఉన్నప్పటికీ పొత్తులతో వెళ్దామనే విషయాన్ని రాబిన్ శర్మే నూరిపోస్తున్నారని, ఆయన వ్యూహాలు సక్రమంగా పనిచేయడంలేదంటూ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ను ఇరుకున పెట్టేవిధంగా వ్యూహాలు రూపొందించాలికానీ.. అలా కాకుండా తమపై భారం మోపే విధంగా కార్యక్రమాలుంటున్నాయన్నారు. రాబిన్ చెప్పినట్లుగా నడుకోవాలని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశిస్తున్నారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగానే భవిష్యత్తులో టికెట్లు కేటాయిస్తామని అధినాయకత్వం చెబుతున్నాప్పటికీ పార్టీ నాయకులు లైట్ తీసుకుంటున్నారు.

English summary
Mini Mahanadu, Badude Badudu and Ideem Kharma Rastra programs organized by Telugu Desam Party are designed by Robin Sharma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X