ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Eluru Corporation : ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 25న-ఎస్ఈసీ ప్రకటన

|
Google Oneindia TeluguNews

పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఏలూరు కార్పోరేషన్ ఎవ్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఏలూరు కాార్పోరేషన్ కు ఇప్పటికే ఎన్నికలు పూర్తయినా అక్రమాలపై పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు వాటిని విచారించి క్లియరెన్స్ ఇచ్చించి. అయినా కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఓట్ల లెక్కింపు జరగలేదు.

ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో అక్రమాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఓట్ల లెక్కింపును తొలుత వాయిదా వేసింది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు వ్యవహారాన్ని ఎస్ఈసీకి కట్టబెడుతూ ఆదేశాలు ఇచ్చింది. అయితే కరోనా కారణంగా ఇప్పటివరకూ ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. ఇప్పుడు కరోనా కాస్త తగ్గడంతో ఎన్నికల్లో పోలైన ఓట్లను లెక్కించేందుకు ఎస్ఈసీ ముహుర్తం నిర్ణయించింది.

Eluru corporation elections votes counting on july 25, sec announced date as per hc order

ఈ నెల 25న ఏలూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు కోసం ఎస్ఈసీ నీలం సాహ్నీ ఆదేశాలు ఇచ్చారు. ఏలూరులో ఓట్ల లెక్కింపు కోసం ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదలైంది. హైకోర్టు మే 7న ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూనే, కరోనా నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుందని ఎస్ఈసీ ప్రకటించింది. పోటీలో ఉన్న అభ్యర్ధులను తమ కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఇవ్వకపోతే ఎల్లుండి సాయంత్రం వరకూ వాటి సమర్పణకు గడువు ఇచ్చారు.

గతంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి మినహా మిగతా అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను కైవసం చేసుకున్న వైసీపీ.. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లోనూ గెలుపుపై ధీమాగా కనిపిస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ గెలుపు వైసీపీకి ప్రతిష్టాత్మకం కానుంది. ఇప్పటికే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం సర్వశక్తులొడ్డిన ఆళ్లనాని.. కార్పోరేషన్ కైవసం చేసుకోవడంపై ధీమాగా ఉన్నారు.

English summary
andhrapradesh sec neelam sawhney on today announced eluru corporation elections votes counting date. as per the orders votes will be counted on july 25.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X