వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ కు తిలకం దిద్దిన బ్రాహ్మణి : అమ్మ -నాన్న- మామకు పాదాభివందనం : ఎమోషనల్..!!

పాదయాత్రకు బయల్దేరే వేళ లోకేష్ కు తిలకం దిద్ది హారతి ఇచ్చిన బ్రాహ్మణి. తల్లి తండ్రులు, బాలయ్య-వసుంధర ఆశీర్వాదం తీసుకున్న లోకేష్.

|
Google Oneindia TeluguNews

నారా లోకేష్ యువగళం యాత్రకు బయల్దేరారు. 27వ తేదీన కుప్పం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. అక్కడ నుంచి కడప చేరుకొని దర్గా.. చర్చిల్లో ప్రార్ధనల్లో పాల్గొంటారు. రేపు (గురువారం) తిరుమల శ్రీవారిని దర్శించుకొని..కుప్పం చేరుతారు. యాత్రకు బయల్దేరుతున్న సమయంలో లోకేష్ కు సతీమణి బ్రాహ్మణి తిలకం దిద్ది హారతి ఇచ్చారు. యాత్ర సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు..బాలయ్య దంపతుల తో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు లోకేష్ కు అభినందనలు తెలిపారు. ఆ సమయంలో ఒకింత ఎమోషన్ వాతావరణం కనిపించింది.

యువగళం యాత్రక బయల్దేరిన లోకేష్

యువగళం యాత్రక బయల్దేరిన లోకేష్


టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ యువగళం యాత్రకు బయల్దేరారు. బయల్దేరే సమయంలో ఇంటి వద్ద ఉత్సాహంతో పాటుగా ఒకింత ఎమోషనల్ వాతావరణం కనిపించింది. యాత్రకు బయల్దేరే ముందు లోకేష్ తన కుమారుడు దేవాన్ష్ తో కొద్ది సేపు గడిపారు. దేవాన్ష్ ను హత్తుకున్నారు. లోకేష్ బయల్దేరే సమయానాకి బాలయ్య దంపతులతో సహా నందమూరి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. లోకేష్ ముందుగా అన్నా - నాన్న కు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. బాలయ్య దంపతుల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్న లోకేష్ కు బ్రాహ్మణి తిలకం దిద్ది హారతి ఇచ్చారు. ఆ తరువాత చంద్రబాబు గుమ్మం వద్ద కుమారుడు కోసం నిరీక్షించారు. బయల్దేరే ముందుకు లోకేష్ ను దగ్గరకు తీసుకున్న చంద్రబాబు భుజం పైన చేయి వేసి..ఆల్ ది బెస్ట్ చెప్పారు. చంద్రబాబు - లోకేష్ ఒకింత ఎమోషనల్ గా కనిపించారు.

నేడు కడప..రేపు తిరుమలకు లోకేష్

నేడు కడప..రేపు తిరుమలకు లోకేష్


ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా లోకేష్ సాయంత్రం కడప చేరుకుంటారు. అక్కడ అమీన్ పీర్ దర్గా సందర్శిస్తారు. ఆ తరువాత కడపలోని చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. రాత్రికి తిరుమల చేరుకుంటారు. రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో కుప్పంకు చేరుకొని అక్కడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. 27వ తేదీ కుప్పంల భారీ బహిరంగ సభ జరగనుంది. పార్టీ నేతలు..కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుంటారు. కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలోనే లోకేష్ యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే లోకేష్ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు చేసారు.

400 రోజులు...4 వేల కిలో మీటర్లు

400 రోజులు...4 వేల కిలో మీటర్లు


లోకేష్ పాదయాత్ర నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలో మీటర్లు సాగనుంది. దాదాపు ఏడాది పాటు ఈ యాత్ర సాగనుంది. దాదాపుగా 125 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ ప్లాన్ చేసారు. మధ్య లో బ్రేకులు లేకండా యాత్ర కొనసాగేలా ప్రణాళికలు సిద్దం చేసారు. లోకేష్ తో పాటుగా నిత్యం ఫాలో అయ్యే టీంలను ఎంపిక చేసారు. ఎక్కడికక్కడ స్థానిక టీడీపీ నేతలు లోకేష్ యాత్రలో పాల్గొంటారు. ప్రధానంగా యువతకు ఈ యాత్రలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. లోకేష్ యాత్రకు సంబంధించిన అనుమతి విషయంలో వివాదం కొనసాగినా.. పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసారు. దీంతో.. 27వ తేదీన లోకేష్ కుప్పం నుంచి యువగళం యాత్రకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేసారు.

English summary
around:Nara Lokesh kick starts his padayatra yuvagalam,takes blessings from Chandrababu and bhuvaneshwari at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X