'పెద్ది' ట్రైలర్ రివ్యూ : రెచ్చిపోయిన రామ్ చరణ్.. పోతారు.. మొత్తం పోతారు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ 'పెద్ది'.. కొద్దిసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. పెద్ది ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. ఇలాంటి ట్రైలర్ కట్ నెవర్ బిఫోర్.. ఎఫర్ ఆఫ్టర్ అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ది ట్రైలర్ చూశాక రామ్ చరణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారని.. సినిమా ఫ్యాన్స్ అంతా చెర్రీ ఫ్యాన్స్ అయిపోతారని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. 3 నిమిషాల ట్రైలర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగుతుంది.
ఆపండి.. అని ఓ రైలును చూస్తూ జగపతిబాబు అరవడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.. ఆ తర్వాత ఇక్కడ ఎవరినీ అడిగినా ఫేవరేట్ ప్లే మారుతుంది.. కానీ ఫేవరేట్ ప్లేయర్ మాత్రం మారడం లేదు.. అని బొమన్ ఇరానీ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. పెద్ది అనేది ఈ ఏరియాలో ఏమైనా దేవుని పేరా..? అన్న డైలాగ్ వస్తుంది. నా ఫేవరెట్ కుస్తీ ప్లేయర్ పెద్ది సార్.. నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్.. అన్న డైలాగ్స్ రామ్ చరణ్ క్యారెక్టర్ పై అంచనాలను పెంచేస్తున్నాయి. ఆ తర్వాత రామ్ చరణ్ బ్లాస్టింగ్ ఎంట్రీ ఉంటుంది. ఆటంటే నా పొగరు అనే డైలాగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ ను తెలియజేస్తుంది.
ఆ తర్వాత హీరోయిన్ జాన్వీ కపూర్, రామ్ చరణ్ లవ్ సీన్స్ వస్తాయి. చుక్కలతో జాన్వీ కపూర్ ను రామ్ చరణ్ వర్ణించే తీరు అద్భుతం.. బొక్కలోని కబుర్లు చెప్పకు నాకు.. పీకినవ్ అనే డైలాగ్స్ జాన్వీ నోట వింటుంటే ఫ్యాన్స్ నుంచి విజిల్స్ పక్కా అని తెలుస్తోంది. ఆ తర్వాత కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఎంట్రీ ఉంటుంది. నాకు ఆట గెలవడం కాదు.. బతకడం కావాలి అని చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది. ఆ తర్వాత జగపతిబాబు, దివ్యేందు శర్మ డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. రామ్ చరణ్.. మాటలతో కాదు.. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికి ఉందో రమ్మను అని రామ్ చరణ్ చెప్పే డైలాగ్ హైలెట్ గా ఉంది.

చివరగా నేను ఆడాను అనుకుంటున్నారు.. కానీ నేను పోరాడాను సారు అని రామ్ చరణ్ చెప్పే డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలవనుంది. చివరి 30 సెకన్లలో రామ్ చరణ్ నట విశ్వరూపం కనిపిస్తోంది. సినిమాకు సంబంధించిన సోల్ మొత్తం ఆ 30 సెకండ్స్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ది ఎమోషనల్ జర్నీ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే పెద్ది ట్రైలర్ లో ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంచెం తగ్గినట్లుగా కనిపిస్తోంది. అయితే మూవీ రిలీజ్ తర్వాత దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. మొత్తానికి పెద్ది ట్రైలర్ ఓ రేంజ్ ఉండటంపై మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ మూవీ జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications