షాకింగ్ వీడియో: ఏనుగు కింద నలిగి టూరిస్టు మృతి..
కర్ణాటకలోని కొడగు జిల్లా దుబారే ఎలిఫెంట్ క్యాంప్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఏనుగు టూరిస్టు మీద పడిపోవడంతో అక్కడికక్కడే ఆ టూరిస్టు మృతి చెందింది. దుబారే ఎలిఎలిఫెంట్ క్యాంప్ లో రోజూ మాదిరిగానే కావేరీ నదిలో ఏనుగులకు స్నానం చేపిస్తుండగా కాంచన్, మార్తాండ అనే రెండు ఏనుగులు ఘర్షణకు దిగాయి. ఒకదానిపై మరొకటి దాడి చేసుకున్నాయి. దీంతో ఆ ఏనుగుల పక్కనే ఉన్న తమిళనాడుకు చెందిన పర్యాటకురాలు తులసి ఒక్కసారిగా భయపడిపోయి పరిగెత్తే క్రమంలో కింద పడిపోయింది. అదే సమయంలో ఆమెపై ఏనుగు పడింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ప్రమాద సమయంలో మృతురాలి భర్త, పిల్లలు పక్కనే ఉన్నారు. కానీ వాళ్లు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. సరదాగా పిల్లలతో వచ్చిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పిల్లలు, భర్త ముందే ఆమె ప్రాణాలు కోల్పోయింది. రెండు ఏనుగులు దాడి చేసుకుంటున్న సమయంలో ఓ ఏనుగుపై మావటివాడు ఉన్నాడు. కానీ ఏనుగును అదుపు చేయలేకపోయాడు. దాంతో ఓ ఏనుగు కింద పడిపోగా.. ఆ ఏనుగు కింద సదరు మహిళ నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందింది.
#Kodagu Sad incident occurred while #ElephantBathing at #DubareCamp 33-year-old woman from #Chennai died on the spot@aranya_kfd@eshwar_khandre @BoskyKhanna @prajna_gr pic.twitter.com/73skY5l9ZU
— Amit Upadhye (@AmitSUpadhye) May 18, 2026
ఈ ఘటన సమయంలో పర్యటకులు అంతా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ పరుగులు తీశారు. ఇక అప్పటికే ఓ ఏనుగు కింద పడిపోవడంతో రెండు ఏనుగుల మధ్య ఘర్షణ తగ్గింది. లేదంటే మరింత ప్రాణనష్టం వాటిల్లేది. ఇక ఆ మహిళ మృతి పట్ల కర్నాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖాండ్రే నివాళులు అర్పించారు. ఈ ఘటనపై విచారణకు అధికారులను ఆదేశించారు. శిక్షణ పొందిన పెంపుడు జంతువులు అయినప్పటికీ ఒక్కోసారి ఊహించని విధంగా ప్రవర్తించవచ్చని మంత్రి పేర్కొన్నారు. వన్యప్రాణుల శిబిరాల్లో జంతువులకు అతి సమీపంగా పర్యటకులు వెళ్లకుండా తక్షణమే మార్పులు చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications