తిరుమల నెయ్యి వివాదంలో ఊహించని మలుపు, ఇక ఫిక్స్..!!

సంచలనంగా మారిన తిరుమల నెయ్యి వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సిట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. గతంలోనూ ఈవో గా పని చేసిన ప్రస్తుత ఈవో అనీల్ కుమార్ సింఘాల్ సహా ముగ్గురి అధికారుల పై చర్యలకు సిఫారసు చేసింది. అదే సమయంలో కల్తీ గురించి పూర్తి వివరాలు వెల్లడించింది. కాగా, ఈ కేసు పైన రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. ఆరోపణలు... ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఈ కేసులో చోటు చేసుకున్న తాజా పరిణామం సంచలనంగా మారుతోంది.

తిరుమల నెయ్యి వివాదం లో ఇప్పుడు కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును సిట్ విచారణ చేసి.. అనేక అంశాలను గుర్తించింది. రూ.235 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో హవాలా మార్గాల ద్వారా భారీ మొత్తాల్లో సొమ్ము చేతులు మారినట్లు పేర్కొంది. దీంతో, ఈ వ్యవహా రంలో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను ఈడీ అధికారులు సిట్‌ నుంచి తాజాగా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, 36 మంది నిందితుల సమాచారం, వారి రిమాండ్‌ రిపోర్టులు, ఇప్పటివరకూ దాఖలు చేసిన అభియోగ పత్రాలు, వివిధ రాష్ట్రాల్లోని హవాలా ఏజెంట్ల ప్రమేయం, వారి పాత్ర తదితర అంశాలపై సమాచారం తీసుకుని ఈడీ విచారణకు సిద్దం అయింది. ఈ కేసులో భారీ ఎత్తున మనీ లాండరింగ్‌ జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ భావిస్తోంది. త్వరలోనే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.

enforcement-directorate-focus-on-ttd-ghee-adulteration-case-seek-financial-transaction-details-from

వివరాల సేకరణ

సిట్ విచారణలో టీటీడీకి నెయ్యి సరఫరా వివరాలు... ఏ సంస్థ నుంచి ఎంత మేర సరఫరా చేసారు.. అందులో నాణ్యత ఎంత వంటి అంశాల పైన పూర్తి స్థాయి సమాచారం సేకరించింది. తమ సంస్థతో పాటు వైష్ణవి, ఏఆర్, మాల్‌గంగా డెయిరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసిన భోలేబాబా డైరెక్టర్లు పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌లు ఈ అక్రమ కార్యకలాపాల కోసం విజయవాడ, చెన్నై, హైదరాబాద్, గుజరాత్, దిల్లీ, గ్వాలియర్‌ తదితర ప్రాంతాల్లోని పలువురు హవాలా ఏజెంట్ల ద్వారా డబ్బులు చెల్లింపులు జరిగినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందీ... ఎవరికి నగదు ముట్టిందీ వంటి అంశాల పైన ఆరా తీస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో హవాలాతో పాటు వివిధ మార్గాల్లో వచ్చిన డబ్బు ఏం చేశారు ఎక్కడికి మళ్లించారు అనేది ఈడీ దర్యాప్తు చేయనుంది. దీంతో.. ఈడీ ఇప్పుడు ఎవరికి నోటీసులు ఇవ్వనుంది.. ఏం తేల్చనుందీ.. ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+