ఇంజనీరింగ్ విద్యార్థి పురుగుల మందు త్రాగి ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామానికి చెందిన విద్యార్ధి సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తెనపల్లి నలంద ఇంజినీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతూ స్థానిక నాగార్జున కాలనీ లో బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు.

బుధవారం కూల్డ్రింక్ లో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సతీష్ మంచి విద్యార్థి అని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అర్ధం కాలేదని అతని స్నేహితులు చెప్పారు. ఉదయం కాలేజీకి వెళ్లిన విద్యార్థి మధ్యాహ్నం తరువాత హాస్టలు రూమ్ కి వెళ్ళాడు. అక్కడ కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని మృతి చెందగా హాస్టల్ రూమ్ కి వెళ్లిన స్నేహితులకు సతీష్ విగతాజీవి కనిపించాడు.

Engineering student commits suicide in guntur

వెంటనే అతని స్నేహితులు హాస్టల్ నిర్వాహకులకి సమాచారం ఇచ్చారు. అప్పటికే సతీష్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి హాస్టల్లో విచారణ చేపట్టారు. మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An engineering student has commited suicide in Guntur district of Andhra Pradesh

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X