నారా లోకేష్‌కు మంచి పదవి: ఎర్రబెల్లి, పార్టీ గుర్తుపై మార్పుపై రేవంత్
హైదరాబాద్: తమ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్‌కు మంచి పదవి ఇవ్వాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ కోరారు. టిడిపి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మంగళవారంనాడు మాట్లాడారు.
మహానాడులోనే టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఏపీ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తోందని, తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష మాత్రమే ఇస్తోందని విమర్శించారు. ఇక వడదెబ్బ మృతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకోవడంలేదని ఎర్రబెల్లి ఆరోపించారు.

తమ పార్టీని జాతీయ పార్టీగా మార్చబోతున్న నేపథ్యంలో పార్టీ గుర్తు మార్పు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ అధ్యయనం చేస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి పునరంకితమయ్యేలా మహానాడులో చర్చలు జరుగుతాయన్నారు. దేశ రాజకీయాలపైనా సమాలోచనలు చేస్తామని రేవంత్ వివరించారు.












Click it and Unblock the Notifications