పార్టీ మారేందుకు బొత్సతో ఎర్రబెల్లి చర్చలు: కడియం

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలతో పార్టీ మారే అంశంపై మాట్లాడిన అంశంపై ఎర్రబెల్లి బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. కాంగ్రెసులో తెరాసను విలీనం చేసేందుకు తాము డీల్ కుదుర్చుకున్నామని ఎర్రబెల్లి విమర్శించడం శోచనీయమన్నారు. డీల్ చేయడంలో ఎర్రబెల్లే నేర్పరి అన్నారు.
తెరాసలో చేరేందుకు బేరసారాలు ఆడిన ఎర్రబెల్లి అది సాధ్యం కాకపోవడంతో పదిమంది ఎమ్మెల్యేలతో కాంగ్రెసు పార్టీలో చేరేందుకు బొత్సతో మాట్లాడారని ఆఱోపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక పునర్నిర్మాణ సాధనలో తెరాస పాత్ర ఉంటుందన్నారు.
తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టక ముందే కాంగ్రెసు నాయకులు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని, జిల్లా మంత్రులు చిల్లర ఆపేసి అధిష్టానంపై బిల్లు కోసం ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఉద్యమ సమయంలో అడ్రస్ లేని నాయకులు తెలంగాణ పూర్తిస్థాయిలో ఏర్పడకముందే తమ ఘనత అంటున్నారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications