చంద్రబాబుకి షాక్: టిడిపికి గుడ్‌బై, కాంగ్రెస్‌లోకి ఎర్రబెల్లి?

Errabelly may resign to Telugudesam
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు ఆ పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఈ రోజు తన నివాసంలో ముఖ్యులైన కార్యకర్తలను, తన అనుచరులతో సమావేశమై, ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎర్రబెల్లి దాదాపు టిడిపిని వీడటం ఖాయమని చెబుతున్నారు. ఆయన కాంగ్రెసు పార్టీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది.

ఈ రోజు మధ్యాహ్నం రెండుగంటలకు ఆయన తన వర్గం వారితో భేటీ కానున్నారు. ఈ భేటీలో కార్యకర్తలు, తన అనుచరుల అభిప్రాయాలను ఆయన తీసుకోనున్నారు. ఆ తర్వాత ప్రకటన చేయనున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను ఎర్రబెల్లి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా, ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్, వికారాబాద్ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే వేణుగోపాలా చారి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టిడిపికి రాజీనామా చేసి తెరాసలో చేరారు.

ఇటీవల నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, రంగారెడ్డి జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే రత్నం, అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి తెరాసలో చేరారు. వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, బోథ్ ఎమ్మెల్యే నగేష్‌లు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+