టి: శైలజానాథ్ నోట న్యూటన్ లా, జగన్‌పై యనమల ఫైర్

హైదరాబాద్/అనంతపురం: యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి సాకె శైలజానాథ్ శుక్రవారం అన్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయంపై ఆయన పై విధంగా స్పందించారు. కేంద్రానికి తమ ప్రతి స్పందనను తెలియజేస్తామని హెచ్చరించారు.

జగన్ పైన యనమల

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌కు, రాష్ట్ర విభజనకు ఏఐసిసి అధ్యక్షురాలు లింకు పెట్టారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సోనియా వద్ద విభజనకు అంగీకరించిన జగన్ ఇప్పుడు 24 గంటల సీమాంధ్ర బంద్‌కు పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు.

Every Action has an equal and Opposite reaction: Sailajanath

జగన్ సమైక్యాంధ్ర ముసుగులో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సోనియా, కెసిఆర్, జగన్‌లు మంతనాలు జరిపే రాష్ట్ర విభజనపై ఓ నిర్ణయానికి వచ్చారన్నారు. విభజన ప్రక్రియలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.

ఉద్యమకారుడినౌతా: పితాని

మంత్రి పితాని సత్యనారాయణకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సమైక్య సెగ తగిలింది. సమైక్యవాదులు అడ్డుకొని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పితాని మాట్లాడారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తాము శాయశక్తులా కృషి చేశామని చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే తాను ఉద్యమకారుడిని అవుతానని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు పట్టించుకోకుండా తెలంగాణ పట్ల కేంద్రం పక్షపాత వైఖరి అవలంభించిందని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+